American Journalist: ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇదిగో వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అతడికి ఇరాన్‌కు సమీపంగా ఉన్న కతైబ్ హెజ్‌బొల్లా మిలిషియా గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తమవుతోంది.
వివరాలు
ఘటనపై ఎలీసా లీస్ మునోజ్ తీవ్ర ఆందోళన
ఇదే సమయంలో, ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఖతర్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరా వీడియోను విడుదల చేయడం మరింత సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ మహిళా మీడియా ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎలీసా లీస్ మునోజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షెల్లీ కిటెల్సన్ ఎంతో ధైర్యవంతురాలైన జర్నలిస్ట్ అని, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆమె వార్తలు కవర్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరగడం బాధాకరమని అన్నారు. బాగ్దాద్ వీధుల్లో ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎలెక్స్ సాల్వి చేసిన ట్వీట్
NEW: The Iraqi government provides details on the kidnapping of an American journalist (believed to be Shelly Kittleson):
— Alex Salvi (@alexsalvinews) March 31, 2026
• Taken by “unknown individuals” in Baghdad
• Security forces pursued the perpetrators
• Vehicle rolled over in pursuit, surrounded
• One suspect… pic.twitter.com/7vb278VP0V