LOADING...
Iran's Isfahan: బంకర్‌ బస్టర్లతో.. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై విరుచుకుపడిన అమెరికా
బంకర్‌ బస్టర్లతో.. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై విరుచుకుపడిన అమెరికా

Iran's Isfahan: బంకర్‌ బస్టర్లతో.. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై విరుచుకుపడిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో అణు కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కీలక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసింది. ఈ దాడిలో భాగంగా ఆయుధ నిల్వలు ఉన్న డిపోను లక్ష్యంగా చేసుకుని 2,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఈ భారీ దాడి కారణంగా ఆ ప్రాంతంలో విపరీతమైన మంటలు చెలరేగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధికారుల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఆయుధ నిల్వలను ధ్వంసం చేయడమే లక్ష్యం

ముఖ్యంగా భూగర్భంలో ఉన్న ఆయుధ నిల్వలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రూత్ లో ట్రంప్ చేసిన పోస్ట్ 

Advertisement