Page Loader
America: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి,9 మందికి గాయాలు 
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి,9 మందికి గాయాలు

America: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి,9 మందికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్‌ పార్క్‌ ప్రాంతంలో ఈ కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా,పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం,సోమవారం నాడు మెమోరియల్‌ డే సందర్భంగా ఆ ప్రాంతంలో ప్రజలు అధికంగా గుమికూడారు. రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాలు 

దక్షిణ కరోలినాలో మరో కాల్పుల ఘటన

అయితే, ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియజేయలేదని అధికారులు తెలిపారు. ఇక ఇదే తరహాలో మరో కాల్పుల ఘటన దక్షిణ కరోలినాలో ఆదివారం చోటుచేసుకుంది. అక్కడ లిటిల్‌ రివర్‌ అనే ప్రాంతంలో రాత్రి 9:30 ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.