Iranian drone carrier ship : ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై అమెరికా దాడి.. మంటల్లో భారీ యుద్ధనౌక
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.బాంబుల శబ్దాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ నేవీపై దాడులు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన డ్రోన్ వాహక యుద్ధనౌకపై అమెరికా దాడి చేసినట్లు సమాచారం వెలువడింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ తమ ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించింది.
వివరాలు
దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో..
దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఇరాన్ నేవీ సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్లు కొనసాగుతున్నాయని తెలిపింది. తాజాగా నిర్వహించిన దాడిలో ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ఆ భారీ యుద్ధనౌక మంటల్లో చిక్కుకుందని పేర్కొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇరాన్ డ్రోన్ క్యారియర్ షిప్ ధ్వంసం.. వీడియో విడుదల
U.S. forces aren't holding back on the mission to sink the entire Iranian Navy. Today, an Iranian drone carrier, roughly the size of a WWII aircraft carrier, was struck and is now on fire. pic.twitter.com/WyA4fniZck
— U.S. Central Command (@CENTCOM) March 6, 2026