US-Weapons-Israel: అమెరికా ఆయుధాలను ఇజ్రాయెల్ వినియోగించడంపై యూఎస్ మండిపాటు: యూఎస్ అంతర్గత నివేదికలో వెల్లడి
ఇజ్రాయెల్(Israel)అమెరికా(America)సరఫరా చేసిన ఆయుధాలను(Weapons)ఉపయోగించడంపై అమెరికా సీనియర్ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. కొంతమంది ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అంతర్గత స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక లో వెల్లడైంది. అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా ఈ ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇచ్చిన హామీల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ కొంతమంది అధికారులు విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌కు అనుమానాలు వ్యక్తం చేసినట్లు నివేదికలో పేర్కొంది. అయినప్పటికీ, ఇజ్రాయెల్ కు మద్దతిచ్చే ఇతర అధికారులు భారీగానే ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు జో బిడెన్ జారీ చేసిన జాతీయ భద్రతా ప్రకటన పత్రం ప్రకారం బ్లింకెన్ మే 8 నాటికి ఇజ్రాయెల్ ఇచ్చిన హామీలపై తన వైఖరిని కాంగ్రెస్‌కు తెలియజేయాలి.
ఇప్పటికే నివేదికలు అందించిన స్టేట్ డిపార్ట్‌మెంట్ బ్యూరోలు
మార్చి చివరి నాటికి, కనీసం ఏడు స్టేట్ డిపార్ట్‌మెంట్ బ్యూరోలు తమ అభిప్రాయాలను నివేదికల రూపంలో ఇప్పటికే సమర్పించాయి. గాజాలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘిస్తుందా లేదా అనే దానిపై స్టేట్ డిపార్ట్ మెంట్ ఒక నివేదిక అందించినట్లు తెలుస్తోంది. ''ఇందులో ఇజ్రాయెల్ హామీలను అంగీకరించడానికి కొందరు మొగ్గుచూపగా..మరికొందరు వాటిని తిరస్కరించడానికి మొగ్గుచూపాయి. మరికొందరు ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు'' అని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు.