Loading...
Strait of Hormuz: హర్మూజ్‌లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్.. 
హర్మూజ్‌లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్..

Strait of Hormuz: హర్మూజ్‌లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధిలో అమెరికా సైన్యం రహస్య షిప్పింగ్‌ కారిడార్‌ను నిర్వహిస్తున్నట్లు అమెరికా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ రహస్య మార్గం ద్వారా నౌకలను సురక్షితంగా జలసంధి దాటిస్తున్నట్లు పేర్కొంది. కాల్పుల విరమణ కొనసాగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొన్ని వారాలుగా అమెరికా దళాలు రాత్రి వేళల్లో రహస్యంగా 15 నుంచి 20 వరకు చమురు ట్యాంకర్లను హర్మూజ్‌ జలసంధి దాటిస్తున్నట్లు సమాచారం. ఒమన్‌ తీరానికి సమీపంలోని దక్షిణ ఛానెల్‌ మార్గాన్ని ఇందుకోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్గం ద్వారా రోజుకు కనీసం కోటి బ్యారెళ్ల చమురు మార్కెట్‌కు అందుబాటులోకి వస్తున్నట్లు అంచనా.

వివరాలు 

ట్యాంకర్ల రాకపోకలకు అమెరికా సైన్యం సహకారం 

యుద్ధానికి ముందు సాధారణంగా సరఫరా అయ్యే చమురులో ఇది దాదాపు సగానికి సమానమని సమాచారం.

ట్యాంకర్ల రాకపోకలకు కూడా అమెరికా సైన్యం సహకరిస్తోంది.

చమురు ఖాళీ అయిన ట్యాంకర్లు తిరిగి గల్ఫ్‌ దేశాల్లోని రేవులకు చేరుకునేలా ఏర్పాట్లు చేసి, అక్కడ మళ్లీ చమురు నింపుకున్న తర్వాత హర్మూజ్‌ మార్గంలో ప్రయాణించేలా భద్రత కల్పిస్తోంది.

ఈ మొత్తం రహస్య ఆపరేషన్‌ను అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఉన్న ఫోర్ట్‌ బ్రాగ్‌ నుంచి అమెరికా టాస్క్‌ ఫోర్స్‌ సమన్వయం చేస్తున్నట్లు కథనాలు వెల్లడించాయి.

ఈ ఆపరేషన్‌కు గల్ఫ్‌ దేశాల నుంచి కూడా సహకారం అందుతున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ ఫోర్స్‌ నిర్దేశించిన సమయాల్లోనే ట్యాంకర్లను కాన్వాయ్‌లుగా తరలిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

ఇరాన్ పట్టు సడలిందా?

ఇదిలా ఉండగా.. ఇటీవల రెండు వారాల పాటు జరిగిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన సముద్ర రాడార్లు, నిఘా వ్యవస్థలను అమెరికా తీవ్రంగా దెబ్బతీసినట్లు తెలుస్తోంది.

దీంతో ఒమన్‌ వైపు సముద్ర ప్రాంతంపై నిఘా పెట్టే ఇరాన్‌ సామర్థ్యం గణనీయంగా తగ్గినట్లు సమాచారం.

ప్రస్తుతం హర్మూజ్‌ మీదుగా ప్రయాణించే నౌకలకు డ్రోన్‌ దాడుల ముప్పు లేకుండా అమెరికా వాయుసేనకు చెందిన ఫైటర్‌ జెట్లు రక్షణగా వెళ్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్ పట్టు సడలిందా?

మరోవైపు హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ నియంత్రణ దాదాపు 80 శాతం వరకు బలహీనపడినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

గత రెండు వారాల్లో ఒమన్‌ వైపు ఉన్న మార్గం గుండా 80 శాతానికి పైగా నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు షిప్‌ ట్రాకింగ్‌ సంస్థ కెప్లెర్‌ డేటా వెల్లడిస్తున్నట్లు సమాచారం.

దీంతో కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT