LOADING...
Green Card: అక్టోబర్ వరకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశాన్ని నిలిపేసిన అమెరికా 
Green Card: అక్టోబర్ వరకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశాన్ని నిలిపేసిన అమెరికా

Green Card: అక్టోబర్ వరకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశాన్ని నిలిపేసిన అమెరికా 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం,వీసాలు సులభంగా పొందడం గడచిన కాలంలో కష్టతరమైనదైపోయింది. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వ కాలంలో వలసకారులకు,వీసా పొందాలనుకునే వారికి ఇది మరింత క్లిష్టమైంది. తాజాగా గ్రీన్ కార్డ్ పొందే మరో ప్రధాన మార్గం కూడా నిలిచిపోయింది.ఈబీ-3(EB-3),ఈడబ్ల్యూ(EW) వీసాల జారీ యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చేత నిలిపివేయబడింది. ఇందుకు ప్రధాన కారణం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వాటి కోటా పూర్తికావడమే అందుకు కారణం. ఈ నిర్ణయ ప్రకారం,వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు అమెరికా దౌత్య కార్యాలయాలు సంబంధిత వీసాలను జారీ చేయవు. కొత్త కోటా నిర్ణయం అక్టోబర్ 1 తర్వాత మాత్రమే ప్రకటిస్తారు. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ప్రతి ఏడాది అక్టోబర్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది.