LOADING...
US Iran Tension: ఇరాన్ 14 పాయింట్ల శాంతి ప్రతిపాదనకు అమెరికా నో.. అణు కార్యక్రమం ఆపాలన్న ట్రంప్
అణు కార్యక్రమం ఆపాలన్న ట్రంప్

US Iran Tension: ఇరాన్ 14 పాయింట్ల శాంతి ప్రతిపాదనకు అమెరికా నో.. అణు కార్యక్రమం ఆపాలన్న ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు పంపిన 14 పాయింట్ల ప్రతిపాదనను అమెరికా తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలన్న షరతుపై అమెరికా ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని సమాచారం. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఘర్షణలకు ముగింపు పలికేందుకు ఇరాన్ రెండు దశల చర్చల ప్రణాళికను అమెరికాకు పంపినట్లు తెలుస్తోంది. "ఈ ప్రతిపాదన ప్రకారం తొలి దశలో అన్ని ప్రాంతాల్లో యుద్ధ విరమణ అమల్లోకి రావాలని, రెండో దశలో తమ షరతులు అంగీకరిస్తే అణు అంశంపై చర్చలు ప్రారంభిస్తామని ఇరాన్ తెలిపింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం "ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం ఉండనివ్వం" అంటూ మరోసారి స్పష్టం చేశారు.

వివరాలు 

మరోసారి ఉద్రిక్తంగా మధ్యప్రాచ్య శాంతి చర్చలు

ఇటీవల ఇరాన్ పంపిన "శాశ్వత యుద్ధ విరమణ" ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. "వాళ్లు పంపిన ప్రతిపాదన చాలా బలహీనంగా ఉంది. అది పూర్తిగా వ్యర్థం. నేను పూర్తిగా చదవలేకపోయాను" అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. దీంతో మధ్యప్రాచ్య శాంతి చర్చలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ కీలక నేత మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ..... తమ 14 పాయింట్ల ప్రతిపాదనలో పేర్కొన్న ఇరాన్ హక్కులను అమెరికా అంగీకరించాల్సిందేనని హెచ్చరించారు. లేనిపక్షంలో అమెరికా వైఫల్యాలనే ఎదుర్కొంటుందని ఆయన సోషల్ మీడియా వేదిక Xలో పోస్ట్ చేశారు.

వివరాలు 

ఇరాన్ సముద్ర రవాణాపై ఆంక్షలు

ఇప్పటికీ ఇరాన్ ప్రతిపాదనలోని పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. ఆ ప్రాంతంలో ఇరాన్ సముద్ర రవాణాపై ఆంక్షలు విధిస్తూ, నౌకల రాకపోకలకు టోల్ విధించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

Advertisement