Page Loader
US Student Visas: మళ్ళీ ప్రారంభమైన అమెరికా విద్యార్థి వీసాలు..'సోషల్‌' వెట్టింగ్‌ తప్పనిసరి..! 
మళ్ళీ ప్రారంభమైన అమెరికా విద్యార్థి వీసాలు..'సోషల్‌' వెట్టింగ్‌ తప్పనిసరి..!

US Student Visas: మళ్ళీ ప్రారంభమైన అమెరికా విద్యార్థి వీసాలు..'సోషల్‌' వెట్టింగ్‌ తప్పనిసరి..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ విద్యార్థులకు కోసం అమెరికా గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొద్ది రోజుల క్రితం తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసాల ఇంటర్వ్యూల షెడ్యూల్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈసారి వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

వివరాలు 

విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై కఠిన తనిఖీ 

"సోషల్ మీడియా వెట్టింగ్" ద్వారా అమెరికాలోకి రావాలనుకునే ప్రతి వ్యక్తిపై పూర్తిగా పరిశీలన చేయడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమ ఖాతాలను అమెరికా కాన్సులేట్ అధికారులు క్షుణ్ణంగాతనిఖీ చేస్తారని తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్లను 'పబ్లిక్'గా ఉంచాలి అని, ప్రైవసీ సెట్టింగులను మార్చుకోవాలని ఒక సీనియర్ విదేశాంగ శాఖ అధికారి వివరించారు.

వివరాలు 

ముందుగా ఎందుకు నిలిపివేశారు? 

ఈ సంవత్సరం మే నెల చివరి వారంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అందుకు కారణంగా, అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను సమగ్రంగా పరిశీలించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ఇది చేయాల్సి వచ్చిందని అప్పట్లో విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇప్పుడు ఆ ప్రాసెస్‌ను పూర్తిచేసిన తరువాత, మళ్లీ వీసా అపాయింట్‌మెంట్లను ప్రారంభించడంతోపాటు సోషల్ మీడియా వెట్టింగ్‌ను తప్పనిసరి చేసింది.

వివరాలు 

ఏమిటి ఈ 'సోషల్ మీడియా వెట్టింగ్‌'? 

వీసా పొందదగిన అభ్యర్థులు ఎవరు, ఎవరు కాదు అనే విషయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో వారి ఆన్‌లైన్ క్రియాశీలతను అధికారులు విశ్లేషించనున్నారు. ఈ ప్రక్రియకే 'సోషల్ మీడియా వెట్టింగ్' అనే పేరు. విద్యార్థులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో చేసే పోస్టులు, షేర్లు, అభిప్రాయాలు తదితర అంశాల ఆధారంగా వారికి వీసా మంజూరు చేయాలా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు, ఎవరైనా తమ సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే, ఆ విద్యార్థుని మరింత లోతుగా పరిశీలిస్తారు. వారి వల్ల అమెరికా భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు నిర్ధారణకు వచ్చినప్పుడే వారిని అమెరికా విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుమతిస్తారు. అలాంటి సందర్భాల్లోనే విద్యార్థి వీసా మంజూరు చేస్తారు.