US Senate: ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కు షాక్.. అధికారాలకు కళ్లెం వేసిన అమెరికా సెనేట్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌తో సైనిక ఘర్షణలు కొనసాగించకూడదని, అమెరికా బలగాలను వెనక్కి పిలిపించాలంటూ యూఎస్ సెనేట్ మంగళవారం కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 50 మంది సెనేటర్లు ఓటు వేయగా, 48 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు కూడా డెమొక్రాట్లకు మద్దతుగా నిలిచి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాలు
ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం
ఇదే తరహా తీర్మానం ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందింది. రెండు సభల నుంచి మద్దతు లభించడంతో ఈ తీర్మానానికి అధ్యక్షుడి సంతకం అవసరం లేదని తెలుస్తోంది. అయితే ఇది చట్టపరంగా ట్రంప్ నిర్ణయాలను నేరుగా అడ్డుకోలేకపోయినా,రాజకీయంగా ఆయనపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్‌లోని ఉభయ సభలు ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
వివరాలు
పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు
2026 ఫిబ్రవరి చివరి వారాల నుంచి అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ కాలంలో వైమానిక దాడులు, నౌకాదళ దిగ్బంధం వంటి సైనిక చర్యలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అనుమతి లేకుండానే అధ్యక్షుడు యుద్ధ చర్యలకు సిద్ధమవుతున్నారనే ఆందోళనను డెమొక్రాట్లు, రిపబ్లికన్లు రెండువర్గాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. వార్ పవర్స్ చట్టం ఆధారంగా తీర్మానం ఈ నేపథ్యంలోనే అమెరికా యుద్ధ అధికారాల చట్టం (War Powers Act) కింద ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీనిపై వైట్‌హౌస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే గతంలో ఇలాంటి తీర్మానాలు, చర్యలను ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.