Loading...
US Strikes Iran: ఇరాన్‌పై అమెరికా మరో దాడి.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తత
ఇరాన్‌పై అమెరికా మరో దాడి.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తత

US Strikes Iran: ఇరాన్‌పై అమెరికా మరో దాడి.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తత

వ్రాసిన వారు Balachander Sharma
Nov 07, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరోసారి ఇరాన్‌పై పరిమిత స్థాయి దాడులు చేపట్టింది. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీన్ని ఆయన 'మైనర్ స్ట్రైక్'గా అభివర్ణించారు. ఇరాన్‌లోని కేశ్మ్ ద్వీపం సుజా ప్రాంతంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ప్రాంతం హోర్ముజ్‌ జలసంధికి సమీపంలో ఉంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గం యుద్ధం కారణంగా ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైంది.

Details

15 నిమిషాల్లోనే వ్యవస్థను ధ్వంసం చేశామన్న ట్రంప్

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ చిన్న స్థాయిలో యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, దానిని అమెరికా సైన్యం సుమారు 15 నిమిషాల్లోనే ధ్వంసం చేసిందని చెప్పారు.

అంతకుముందు సోమవారం కూడా అమెరికా సైన్యం 'రక్షణాత్మక దాడులు' నిర్వహించినట్లు ప్రకటించింది.

అప్పట్లో కేశ్మ్, హేంగమ్ దీవులతో పాటు బందర్ అబ్బాస్ సమీప ప్రాంతంలో పేలుళ్లు నమోదయ్యాయి. తాజా దాడులు అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత చోటుచేసుకోవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఎదురైన ఎదురుదెబ్బకు ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు కూడా కారణాలుగా నిలిచాయి.

Details

యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు

మరోవైపు ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో తలెత్తిన విభేదాలు ఇప్పటికీ ప్రధాన సమస్యగానే ఉన్నాయి.

ఇదే సమయంలో అమెరికా సెంట్రల్ కమాండ్.. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందించే వారికి 20 మిలియన్ డాలర్ల వరకు బహుమతి, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని ప్రకటించింది.

మరోవైపు ఖతార్ అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తోంది. ట్రంప్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ఫోన్‌లో మాట్లాడారు.

ఖతార్ రక్షణ మంత్రి కూడా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్‌తో చర్చించారు. దీంతో ఒకవైపు దాడులు కొనసాగుతుండగా.. మరోవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT