LOADING...
USA: కరేబియన్ సముద్రంలో వెనెజువెలా పడవపై అమెరికా దాడి
కరేబియన్ సముద్రంలో వెనెజువెలా పడవపై అమెరికా దాడి

USA: కరేబియన్ సముద్రంలో వెనెజువెలా పడవపై అమెరికా దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల చొరబడుదలను అడ్డుకోవడానికి అమెరికా సైన్యాలు వెనెజువెలాకు చెందిన మరో పడవపై దాడి చేశాయి. ఈ ఘటన తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. అమెరికా అధికారులు, ఈ పడవలో నిజంగా మాదక ద్రవ్యాలు ఉన్నాయని ధృవీకరించిన తర్వాతే దాడి చేపట్టామని తెలిపారు. వీటిని అంతర్జాతీయ జలాల్లో తరలిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దారుణమైన ఆయుధాలు అమెరికన్లను విషపూరితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్ (Donald Trump) కూడా తన ట్రూత్‌ సోషల్ పోస్ట్‌లో, ఆ నౌక అమెరికా వైపు వస్తోందని ప్రస్తావించారు.

వివరాలు 

 స్పీడ్ బోట్‌పై దాడి .. 11 మంది మృతి 

''అత్యంత క్రూరమైన డ్రగ్స్‌ ముఠాలు అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి, దేశ ప్రయోజనాలకు ముప్పుగా మారాయి'' అని ట్రంప్‌ పేర్కొన్నారు. రెండు వారాల క్రితం కూడా, అమెరికా సైన్యాలు డ్రగ్స్ తరలిస్తున్న ఓ స్పీడ్ బోట్‌పై దాడి చేయగా, ఆ ఘటనలో 11 మంది మరణించారు. తాజాగా, పడవపై జరిగిన దాడి దృశ్యాలను జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ట్రంప్‌కు చూపించారని ఆయన వెల్లడించారు. ఆ దాడి తరువాత, కరేబియన్ సముద్రంలో పడవలు తక్కువగా కనిపిస్తున్నాయని, అయినప్పటికీ మాదక ద్రవ్య సరఫరా ఇంకా కొనసాగుతోందని ఆయన సూచించారు.

వివరాలు 

నౌకల్లో 2,200 మంది కమాండోలు 

అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ''మా ఖండంలో ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించి ధ్వంసం చేస్తాము. సమయం,ప్రదేశాన్ని మేమే నిర్ణయిస్తాము'' అని ప్రకటించారు. అమెరికా బలగాలు మాదక ద్రవ్యాల ముఠాలపై యుద్ధ స్థాయిలో చర్యలు చేపట్టాయి. కరేబియన్ సముద్రంలో ఎనిమిది వార్‌షిప్‌లను మోహరించి, యూఎస్‌ఎస్‌ శాన్‌ ఆంటోనియో, యూఎస్‌ఎస్‌ ఇవో జిమా, యూఎస్‌ఎస్‌ ఫోర్ట్‌ లాడర్‌డేల్ నౌకలతో 4,500 మంది సైనికులను పంపించారు. 22వ మెరైన్ యూనిట్‌లోని 2,200 మంది కమాండోలు ఈ నౌకల్లో పాల్గొన్నారు.