LOADING...
USA: పాక్‌కు అమెరికా మద్దతు.. ఖనిజాన్వేషణలో కలిసి పనిచేసే అవకాశం
పాక్‌కు అమెరికా మద్దతు.. ఖనిజాన్వేషణలో కలిసి పనిచేసే అవకాశం

USA: పాక్‌కు అమెరికా మద్దతు.. ఖనిజాన్వేషణలో కలిసి పనిచేసే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-పాకిస్థాన్‌ వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ పరిణామంలో అమెరికా తన లోకోమోటివ్ రైళ్లను పాకిస్తాన్‌కు విక్రయించడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదనంగా పాకిస్తాన్‌లో అరుదైన ఖనిజాల అన్వేషణలో కూడా ఇద్దరు దేశాలు కలిసి కృషి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పాక్ పత్రిక ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది. ఈ చర్చలు ఈ ఏడాది అక్టోబర్‌లో పాక్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ వాషింగ్టన్‌ను సందర్శించిన సమయంలో మొదలయ్యాయి. ఆ తర్వాత పాక్ అధికారులు, అమెరికాకు లాభదాయకంగా ఉండే విధంగా చర్చలను కొనసాగించారు. అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు రేమాండ్ ఎమోరి కాక్స్ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల సలహాదారు రికీ గిల్ స్వయంగా పాక్‌తో చర్చలు చేశారు.

Details

కొత్త లోకోమోటివ్‌ల కొనుగోలుకు తగిన ఏర్పాట్లు

ఈ క్రమంలో అమెరికా తయారీ లోకోమోటివ్‌లను పాక్‌ కొనుగోలు చేయాలని గిల్ కోరారు. ప్రస్తుతం పాక్ రైల్వే 55 లోకోమోటివ్‌లను వాడుతోంది, కానీ సరిపడా నగదు లేకపోవడంతో కొత్త లోకోమోటివ్‌ల కొనుగోలుకు తగిన ఏర్పాట్లు అవసరం. అమెరికా-పాక్‌ సంబంధాల్లో మరో ముందడుగు, స్టార్‌లింక్ ఇంటర్నెట్ అనుమతులను సానుకూలంగా పరిశీలించడం. రికీ గిల్ సూచనపై పాక్‌ 5 శాతం డిజిటల్ పన్నును తొలగించింది. ఖనిజ రంగంలో కూడా అమెరికా పెట్టుబడులకు ముందడుగు వేసింది. బలోచిస్థాన్‌లోని రెకో డిక్ మైనింగ్ కంపెనీకి 1.25 బిలియన్‌ డాలర్ల సహాయం పాకిస్థాన్‌కు ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా మంజూరు చేయబడింది.

Details

135 బిలియన్‌ డాలర్ల ద్వారా పెట్టుబడి

మొత్తం 135 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని అమెరికా సిద్ధం చేసింది. ఇరు దేశాలు కృత్రిమ మేధ అభివృద్ధిలో సహకరిస్తూ పాకిస్థాన్‌ ఖనిజాల నిల్వలను గుర్తించేందుకు పని చేయనుండగా, ఈ ఏడాది పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ అమెరికా పర్యటన ఈ సంబంధాల మరింత బలవేతనం చేకూర్చింది.

Advertisement