Loading...
US: వలస దరఖాస్తులపై అమెరికా కీలక మార్పు.. త్వరలో కొత్త విధానం అమలు
వలస దరఖాస్తులపై అమెరికా కీలక మార్పు.. త్వరలో కొత్త విధానం అమలు

US: వలస దరఖాస్తులపై అమెరికా కీలక మార్పు.. త్వరలో కొత్త విధానం అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో వలస ప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఇకపై ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం తప్పనిసరి కానుంది. గ్రీన్‌కార్డు, పౌరసత్వం, ఆశ్రయం వంటి ప్రయోజనాల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. నిర్వహణ వ్యయాలను తగ్గించడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియను మరింత సమర్థంగా మార్చడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఆరు నెలలుగా ఈ-ఫైలింగ్‌ సదుపాయం ఉన్న దరఖాస్తులన్నింటినీ ఇకపై ఆన్‌లైన్‌లోనే స్వీకరించేలా అమెరికా ఫెడరల్‌ రిజిస్టర్‌లో కొత్త నిబంధనను ప్రచురించింది. ఈ విధానం అమలుకు ముందు కనీసం 60 రోజుల నోటీసు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దరఖాస్తుదారులు అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) ఆన్‌లైన్‌ ఖాతా ద్వారా లేదా తపాలా మార్గంలో దరఖాస్తులు పంపే అవకాశం ఉంది.

వివరాలు 

ఆన్‌లైన్‌ విధానంతో దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో వేగం,సామర్థ్యం పెరుగుతాయి: యూఎస్‌సీఐఎస్

కొత్త నిబంధన అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డు కోసం చేసే దరఖాస్తులు, వాటి పునరుద్ధరణలు, కుటుంబ ఆధారిత పిటిషన్లు, పౌరసత్వ అభ్యర్థనలు, ఉపాధి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షణ కలిగిన ఉద్యోగ హోదాకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ విధానంతో దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో వేగం, సామర్థ్యం పెరుగుతాయని యూఎస్‌సీఐఎస్‌ చెబుతోంది.

తప్పులు తగ్గడంతోపాటు అవకతవకలను గుర్తించే సామర్థ్యం మెరుగవుతుందని, భద్రతా పరమైన పరిశీలన కూడా సులభతరం అవుతుందని పేర్కొంది.

వివరాలు 

మినహాయింపు కోరాలంటే..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాని వారికి మాత్రం మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

ఇందుకోసం ప్రత్యేకంగా అభ్యర్థన సమర్పించాల్సి ఉంటుంది.

ఈ అభ్యర్థనకు దరఖాస్తు సమర్పణ రుసుముగా 25 డాలర్లు చెల్లించాలి.

మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం ప్రతి కేసును విడివిడిగా పరిశీలించిన తర్వాత తీసుకుంటారు.

ADVERTISEMENT

వివరాలు 

కాగితపు దరఖాస్తులతో భారీ ఖర్చు..

కాగితాల రూపంలో దరఖాస్తులను స్వీకరించడం, వాటిని స్కాన్‌ చేయడం, వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేయడం, భద్రపరచడం, తపాలా ద్వారా పంపించడం వంటి ప్రక్రియలకు భారీగా ఖర్చవుతోందని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

ఈ ఖర్చులను తగ్గించేందుకే ఆన్‌లైన్‌ విధానాన్ని విస్తరిస్తున్నట్లు వెల్లడించింది.

2025 ఆర్థిక సంవత్సరంలో యూఎస్‌సీఐఎస్‌ 1.4 కోట్లకు పైగా వలస ప్రయోజనాలకు సంబంధించిన అభ్యర్థనలను ప్రాసెస్‌ చేసింది.

లాక్‌బాక్స్‌ సదుపాయాల ద్వారా దాదాపు 45.3 కోట్ల పేజీల కాగితపు పత్రాలను నిర్వహించింది. ఇందుకోసం 39.60 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి.

కేవలం తపాలా సేవలకే కోటి డాలర్లకు పైగా వ్యయం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌కు మార్చడం ద్వారా ఈ నిర్వహణ, తపాలా తదితర ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

ADVERTISEMENT