
Travel Advisory: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పాకిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా,యుకె, చైనా అడ్వైజరీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' కార్యక్రమం కింద పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో, అమెరికాలోని రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది.
భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LoC) సమీప ప్రాంతాల్లో ఎప్పుడైనా సాయుధ ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, ఆ ప్రాంతాల వైపు ప్రయాణాలు చేయకూడదని అమెరికా ఆదేశించింది.
అలాగే, ఇరు దేశాల గగనతలాల మూసివేత సహా పాకిస్తాన్‌లో పరిస్థితిని అమెరికా అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.
ఉగ్రదాడులకు గురైన ప్రాంతాల సమీపంలో నివసిస్తున్న వారు తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఆశ్రయం పొందాలని, ఆ ప్రాంతాలవైపు ప్రయాణించాలనుకుంటున్న వారు తమ ప్రణాళికలను రద్దు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
వివరాలు
భారత్, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది
ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధికారికంగా స్పందించింది.
ఈ ఉద్రిక్తతలు త్వరగా ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు.
రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం ఏ ఒక్కరు కూడా కావాలని ఎవ్వరూ కోరరని చెప్పారు.
భారత్, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉందని అన్నారు. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ప్రపంచానికి శాంతి మాత్రమే కావాలని, ఘర్షణలు వద్దని అన్నారు.
ఇక అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ ఈ దాడులను పక్క ఆధారాలు, సాంకేతిక సమాచారంతో పాటు, ప్రాణాలతో బయటపడ్డ వారి వాంగ్మూలాల ఆధారంగా చేపట్టినట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
పాకిస్తాన్ అధికారులకు సమన్లు జారీ
ఈ చర్యలో భారత్ పౌర,ఆర్థిక లేదా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది.
దాడులు పూర్తిగా ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే జరిగాయని పేర్కొంది.
మరోవైపు, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ రాయబారిని పాకిస్తాన్ అధికారులను పిలిపించి, సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు నుండి 10 కిలోమీటర్లు, నియంత్రణ రేఖ, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ నుండి 10 మైళ్ళు (16.09 కి.మీ) లోపల అన్ని ప్రయాణాలకు వ్యతిరేకంగా విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి కార్యాలయం వరకు ఆ ప్రాంతాలవైపు ప్రయాణించవద్దని UK పౌరులను హెచ్చరించింది.