NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / US: ఆఫ్రికా దేశాలకు అమెరికా హెచ్చరిక.. వలసదారుల కోసం వీసాల నిలిపివేత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    US: ఆఫ్రికా దేశాలకు అమెరికా హెచ్చరిక.. వలసదారుల కోసం వీసాల నిలిపివేత
    ఆఫ్రికా దేశాలకు అమెరికా హెచ్చరిక.. వలసదారుల కోసం వీసాల నిలిపివేత

    US: ఆఫ్రికా దేశాలకు అమెరికా హెచ్చరిక.. వలసదారుల కోసం వీసాల నిలిపివేత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 06, 2025
    01:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు.

    పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిని గుర్తించి, స్వదేశాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇటీవ‌ల అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన ఆఫ్రికా దేశాల పౌరులను తిరిగి పంపారు.

    కొంతమంది ఆఫ్రికా దేశాలు తమ పౌరులను తిరిగి స్వీకరించేందుకు నిరాకరించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అమెరికాకు వచ్చిన ఆయా దేశాల పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.

    ఇమిగ్రేషన్ చట్టాలను గట్టి చేస్తూ, వాటి అమలును మరింత వేగంగా చేయడంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారం తెలిపారు.

    Details

     8,000 మంది అక్రమ వలసదారులు అరెస్టు

    డిపోర్టేషన్ విషయంలో సహకరించకపోతే తాము ఎలా స్పందిస్తామనే ఉదాహరణగా, దక్షిణ సూడాన్‌కు చెందిన వారి వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేశామని, కొత్త వీసాల మంజూరు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆయన చెప్పారు.

    ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని, దక్షిణ సూడాన్ పాస్‌పోర్ట్ కలిగినవారు ఇకపై అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదన్నారు.

    దక్షిణ సూడాన్ ప్రభుత్వం ట్రంప్ పరిపాలన విధానానికి సహకరిస్తేనే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని వెల్లడించారు.

    ట్రంప్ అధ్యక్షత తీసుకున్న తర్వాత ఇప్పటివరకు సుమారు 8,000 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశామని వైట్‌హౌస్ పేర్కొంది.

    Details

    స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలి

    ఈ అరెస్టులో కొందరిని స్వదేశాలకు పంపించగా, మరికొందరు అమెరికా జైళ్లలో లేదా నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు.

    కొంతమంది విదేశీ విద్యార్థులు జాతి వ్యతిరేక ప్రచారంలో పాల్గొంటున్నట్లు గుర్తించి, వారు స్వచ్ఛందంగా దేశం విడిచిపోవాలంటూ అమెరికా విదేశాంగ శాఖ వారికీ మెయిల్స్ పంపింది.

    కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా, ఆందోళనల దృశ్యాలను లేదా జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న విద్యార్థులకు కూడా హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.

    యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ మరియు అమెరికా నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 221(i) ప్రకారం వీరి వీసాలను రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ప్రపంచం

    తాజా

    NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ నరేంద్ర మోదీ
    Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన అమెరికా
    Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన నైరుతి రుతుపవనాలు
    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్

    అమెరికా

    #NewsBytesExplainer: అమెరికా రాజకీయాల్లో క్షమాభిక్ష వివాదం.. అసలు 'ఆటోపెన్' వివాదం ఏంటీ? ప్రపంచం
    John F. Kennedy: అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ హత్యపై రహస్య పత్రాలు రిలీజ్.. నిజాలు వెలుగు చూస్తాయా?  డొనాల్డ్ ట్రంప్
    H-1B visa:మార్చి 20 నుండి H-1B వీసా పాత రికార్డులను తొలగించేందుకు ట్రంప్‌ సర్కారు సిద్ధం ..   వీసాలు
    USA: హమాస్‌తో సంబంధాలు..!  భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు  హమాస్

    ప్రపంచం

    Grammys Awards: భారత సంతతి సింగర్ చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు సినిమా
    Aga Khan: ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్‌ కన్నుమూత అంతర్జాతీయం
    US Deportation: అక్రమంగా ప్రవేశించిన 487 మంది భారతీయులకు అమెరికా షాక్! అమెరికా
    Alaska Aircraft : అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం  విమానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025