Iran: ఇరాన్ అగ్రనేతలను హత్యా చేసేందుకు ఇజ్రాయెల్ స్కెచ్.. అలర్ట్ చేసిన అమెరికా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న అత్యంత కీలకమైన శాంతి చర్చలను భంగపరిచే ఉద్దేశంతో ఇజ్రాయెల్ సంచలన ప్రణాళిక రూపొందించిందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇరాన్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఇద్దరు అత్యున్నత నాయకులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించిందని, ఈ సమాచారాన్ని ముందుగానే గుర్తించిన అమెరికా.. పశ్చిమాసియా దేశాల ద్వారా ఇరాన్ అధికారులను వెంటనే అప్రమత్తం చేసిందని అమెరికా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఆ కథనం వెల్లడించింది. నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకున్న వారిలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ ఉన్నట్లు పేర్కొంది. వీరిద్దరూ అమెరికాతో జరుగుతున్న కీలక శాంతి చర్చల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వెల్లడించింది.
వివరాలు
యుద్ధ విమానాల దాడి నుంచి తప్పించుకున్న స్పీకర్!
ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఏప్రిల్ 12న పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో సమావేశాలు ముగించుకుని ఇరాన్‌కు తిరుగు ప్రయాణం అవుతుండగా భద్రతాపరమైన ముప్పు తలెత్తింది. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్ సరిహద్దు మార్గంగా ఇరాన్ వైమానిక ప్రాంతంలోకి ప్రవేశించాయని నివేదిక పేర్కొంది. ఈకదలికలను అమెరికా సహకారంతో ముందుగానే గుర్తించిన ఇరాన్ భద్రతా సంస్థలు వెంటనే స్పందించాయి. దీంతో గాలిబాఫ్ ప్రయాణిస్తున్న విమానాన్ని ఈశాన్య ఇరాన్‌లోని మషద్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి సుమారు ఎనిమిది గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి సురక్షితంగా టెహ్రాన్‌కు చేరుకున్నారని కథనం తెలిపింది.
వివరాలు
యూఎస్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన రఫ్తార్
గతంలో కూడా జరిగిన దాడుల నుంచి గాలిబాఫ్ రెండుసార్లు ప్రాణాపాయాన్ని తప్పించుకున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28న జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అనంతరం చర్చల ప్రక్రియలో భాగమైన అలీ లారిజానీ, కమల్ ఖరాజీలను కూడా ఇజ్రాయెల్ హతమార్చినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే ఏప్రిల్ నుంచి డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం.. జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ వంటి ప్రతినిధుల ద్వారా ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారిందని నివేదిక తెలిపింది.
వివరాలు
యూఎస్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన రఫ్తార్
ఈ సమయంలో చర్చలను ముందుకు తీసుకెళ్తున్న అరాఘ్చీ, గాలిబాఫ్‌లను కూడా లక్ష్యంగా చేసుకుంటే చర్చలు పూర్తిగా నిలిచిపోయి మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావించినట్లు పేర్కొంది. ఇరాన్‌లో అధికార మార్పు తీసుకురావడం, ఆ దేశ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యంగా ఉండగా.. మరోవైపు అమెరికా మాత్రం హర్మూజ్ జలసంధి భద్రత, అణు కార్యక్రమాల నియంత్రణపై శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని కథనం వెల్లడించింది.
వివరాలు
యూఎస్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన రఫ్తార్
ఈ భిన్నమైన వ్యూహాల నేపథ్యంలో అమెరికా.. ఇజ్రాయెల్‌కు తెలియకుండా రహస్య నిఘా సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేసి, శాంతి చర్చల్లో పాల్గొంటున్న కీలక ప్రతినిధుల భద్రతకు సహకరించిందని నివేదిక పేర్కొంది. ముప్పు కొనసాగుతున్నప్పటికీ, మే నెలలో ఖతార్‌లో, జూన్‌లో స్విట్జర్లాండ్‌లో జరిగిన శాంతి చర్చల్లో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనడం విశేషంగా ప్రస్తావించింది.