LOADING...
Pete Hegseth: ఇరాన్‌పై ఈరోజు మరింత భారీ దాడులు.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
ఇరాన్‌పై ఈరోజు మరింత భారీ దాడులు.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక

Pete Hegseth: ఇరాన్‌పై ఈరోజు మరింత భారీ దాడులు.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 10, 2026
09:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై ఈరోజు గత పదిరోజులతో పోలిస్తే మరింత తీవ్ర దాడులు చేపట్టనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. పెంటగాన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, శత్రువును పూర్తిగా దెబ్బతీసే వరకు అమెరికా విశ్రాంతి తీసుకోదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరగని స్థాయిలో ఈరోజు దాడులు జరుగుతాయని పేర్కొన్నారు. గత 24గంటల్లో ఇరాన్ చాలా తక్కువ సంఖ్యలో మిసైళ్లు ప్రయోగించిందని కూడా తెలిపారు. ఇరాన్ ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒంటరిగా మారిందని హెగ్సెత్ వ్యాఖ్యానించారు. ఈ సైనిక ఆపరేషన్ ఇప్పటికే 10వ రోజును దాటిందని,చివరికి ఇరాన్ తీవ్రంగా ఓటమి చవిచూడాల్సి వస్తుందని అన్నారు. గల్ఫ్ ప్రాంతంలోని దేశాలపై ఇరాన్ దాడులు చేయడాన్నిఆయన తీవ్రంగా ఖండించారు.

వివరాలు 

గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన వైనం

ఆ దేశాల్లో కొన్నింటితో ఇరాన్‌కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, వాటిపై దాడులకు పాల్పడడం అనుచితమని తెలిపారు. ఈరోజు మూడు ప్రధాన లక్ష్యాలను సాధించేందుకు భారీ స్థాయిలో దాడులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం అత్యధిక సంఖ్యలో ఫైటర్ జెట్లు, బాంబర్ విమానాలను వినియోగించనున్నట్లు చెప్పారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, వారి నౌకాదళాన్ని బలహీనపరచడం, అలాగే అణ్వాయుధాల అభివృద్ధిని శాశ్వతంగా నిలిపివేయడం అమెరికా లక్ష్యమని హెగ్సెత్ పేర్కొన్నారు. తమ సైనిక శక్తి, సాంకేతిక నైపుణ్యంతో శత్రువును ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వరకు అమెరికా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement