Loading...
US Commission: ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు దౌత్య మర్యాదలు వద్దు: అమెరికా కమిషన్‌ కీలక వ్యాఖ్యలు
ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు దౌత్య మర్యాదలు వద్దు: అమెరికా కమిషన్‌ కీలక వ్యాఖ్యలు

US Commission: ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు దౌత్య మర్యాదలు వద్దు: అమెరికా కమిషన్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు అమెరికా ప్రభుత్వం ఉన్నతస్థాయి మర్యాదలు ఇవ్వకూడదని, అవసరమైతే వారిపై ఆంక్షలు విధించాలని సూచించింది. మైనారిటీలపై జరుగుతున్న దాడులకు ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలే కారణమని ఆరోపించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు అమెరికా ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశాలకు అవకాశం కల్పించకూడదని, దౌత్యపరమైన మర్యాదలు కూడా ఇవ్వొద్దని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్‌ అసిఫ్‌ మహ్మద్‌, కమిషనర్‌ జీన్‌ మిల్స్‌ 'ఎక్స్‌' వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ చేసిన ట్వీట్ 

వివరాలు 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడు :  అసిఫ్‌ మహ్మద్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడని అసిఫ్‌ మహ్మద్‌ పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక భారీ సంస్థ అని, దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు మతపరమైన మైనారిటీలపై దాడులకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల పట్ల అమెరికా ప్రభుత్వం వ్యవహరించే తీరుపై పునరాలోచించాలని సూచించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నప్పటికీ.. వారికి అమెరికాలో ఉన్నతస్థాయి సమావేశాలు, దౌత్యపరమైన మర్యాదలు కల్పించకూడదని జీన్‌ మిల్స్‌ అన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

చర్చనీయాంశంగా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ సూచనలు

వాటికి బదులుగా మత విశ్వాస స్వేచ్ఛ ఉల్లంఘనలకు బాధ్యులుగా గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులపై ఆంక్షలు విధించే అంశంపై అమెరికా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ వ్యాఖ్యలు మోహన్‌ భాగవత్‌ అమెరికా పర్యటనకు ముందు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వానికి అమెరికా ప్రభుత్వం ఇచ్చే అధికారిక గుర్తింపు, సమావేశాలు, దౌత్య మర్యాదలపై యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ చేసిన ఈ సూచనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ADVERTISEMENT