
Big Insult to Indians: పనికిరాని వ్యక్తులు అమెరికాకు రావొద్దు.. H-1B సెక్రటరీ హోవర్డ్ ఘాటు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా నియమాల్లో భారీ మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఆయన, అమెరికా కంపెనీలు పనికివస్తున్న ఉద్యోగులను మాత్రమే నియమించుకోవాలని, పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడం ఆపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేవలం అత్యుత్తమమైన, విలువైన వ్యక్తులు మాత్రమే యూఎస్‌లో అడుగు పెట్టాలని సూచించారు. హోవర్డ్ వ్యాఖ్యలు ఎక్కువగా భారతీయులు ఉన్న H-1B వీసా ప్రక్రియను లక్ష్యంగా చేసుకోవడం, భారత్‌ను అవమానించే విధంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Details
దరఖాస్తు రుసుము భారీగా పెంపు
ఇక డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో మార్పులు చేసి దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు. H-1B వీసా లాటరీ సిస్టమ్‌ను అమెరికా తొలగించడం వల్ల భారత్‌లోని వర్క్ వీసా దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ శుక్రవారం సంతకం చేసిన ప్రకటన ప్రకారం, H-1B వీసా దరఖాస్తుదారులను స్పాన్సర్ చేసే కంపెనీలు రుసుమును US\$100,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమెరికాలోని ఐటీ, ఇతర రంగాల్లో పని చేసే భారతీయ కార్మికుల కోసం సవాలుగా మారనుంది.