LOADING...
Venezuela: వెనెజువెలాను వణికించిన వరుస భూకంపాలు.. 188 మంది మృతి, వేల భవనాలు ధ్వంసం
వెనెజువెలాను వణికించిన వరుస భూకంపాలు.. 188 మంది మృతి, వేల భవనాలు ధ్వంసం

Venezuela: వెనెజువెలాను వణికించిన వరుస భూకంపాలు.. 188 మంది మృతి, వేల భవనాలు ధ్వంసం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనిజులా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ శతాబ్దంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాలుగా నమోదైన ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రతను నమోదు చేశాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 188 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 1,500 మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

దేశవ్యాప్తంగా భయాందోళనలు

బుధవారం సాయంత్రం వెనెజువెలా అంతటా భారీ భూప్రకంపనలు సంభవించాయి. తొలుత రాజధాని కారకాస్‌కు పశ్చిమాన సుమారు 170 కిలోమీటర్ల దూరంలోని మోరాన్ తీర ప్రాంతంలో 7.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. దాని తర్వాత కేవలం ఒక నిమిషంలోనే మోరాన్ వాయవ్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో కారకాస్‌లోని సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతింది. దీంతో విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. భూకంప ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే.. కారకాస్‌కు సుమారు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్ అమెజాన్ ప్రాంతంలో కూడా ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. అక్కడి అధికారులు ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు.

వివరాలు 

నిలిచిన విద్యుత్ .. రోడ్లపైనే ప్రజలు

భూకంపం సంభవించిన సమయంలో కారకాస్‌లోని ప్రజలు ఊగిపోతున్న భవనాల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికే అనేక భవనాలు కూలిపోవడంతో నగరమంతా శిథిలాల దృశ్యాలు కనిపించాయి. ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే గడిపారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సెల్‌ఫోన్ సేవలు పనిచేయలేదు. భూగర్భ మెట్రో రైళ్లను నిలిపివేశారు. సహజవాయువు సరఫరాను నిలిపేశారు. విద్యాసంస్థలను కూడా మూసివేశారు. ఇదిలా ఉండగా, శిథిలాల కింద చిక్కుకున్న తమ కుటుంబ సభ్యుల కోసం ప్రజలు ఆందోళనగా వెతుకుతున్న దృశ్యాలు కనిపించాయి.

Advertisement

వివరాలు 

లా గువేరా ప్రాంతంలో తీవ్ర విధ్వంసం

భూకంప ప్రభావం అత్యధికంగా లా గువేరా జోన్‌లో కనిపించింది. అక్కడి ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసిపోయాయి. మకుటో ప్రాంతంలో ఉన్న ప్రముఖ'హోటల్ ఎడ్వర్డ్' పూర్తిగా కూలిపోయింది. సముద్ర తీరానికి సమీపంలో, విమానాశ్రయం దగ్గర ఉన్న ఈ 10అంతస్తుల హోటల్ పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధి. సమావేశాలు,వేడుకలు తరచూ జరిగే ఈ భవనం భూకంప ధాటికి శిథిలాల కుప్పగా మారింది. ఆ సమయంలో హోటల్‌లో ఎంతమంది ఉన్నారు,వారి పరిస్థితి ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వెనెజువెలాకు చెందిన ప్రముఖ బేస్‌బాల్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఈ హోటల్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు దేశంలో అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ బుధవారం రాత్రి వెల్లడించారు.

Advertisement

వివరాలు 

పలు దేశాల్లోనూ ప్రకంపనలు

భూకంప ప్రభావం బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంలోని మనాస్, బెలెమ్, మకాపా నగరాల్లో కూడా కనిపించింది. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే కొలంబియాలోని కరీబియన్ తీర ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పరిస్థితిని సమీక్షించిన తర్వాత వాటిని ఉపసంహరించుకుంది.

వివరాలు 

జపాన్, నేపాల్‌లోనూ భూకంపాలు

ఇదే సమయంలో జపాన్ ఉత్తర తీరంలోని ఇవాతే ప్రాంతంలో గురువారం 7.2 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. టోక్యోలో కూడా స్వల్ప ప్రకంపనలు కనిపించాయి. అక్కడి అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అనంతరం వాటిని రద్దు చేశారు. నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని జుమ్లాలో కూడా గురువారం స్వల్ప భూకంపం నమోదైంది. వెనెజువెలాకు అండగా భారత్ భూకంపంతో తీవ్ర నష్టం చవిచూసిన వెనెజువెలాకు అవసరమైన ప్రతి సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, చైనా, స్పెయిన్ తదితర దేశాలు కూడా సహాయక చర్యలకు ముందుకొచ్చాయి.

వివరాలు 

ముందే హెచ్చరించిన గూగుల్

వెనెజువెలాలో భారీ భూకంపం సంభవించడానికి కొన్ని క్షణాల ముందే ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ వ్యవస్థ హెచ్చరికలు పంపినట్లు గూగుల్ వెల్లడించింది. భూమిలో మొదట ఏర్పడిన స్వల్ప సీస్మిక్ కదలికలను ఈ వ్యవస్థ గుర్తించి, సమీప ప్రాంతాల్లోని లక్షలాది మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు వెంటనే అలర్ట్‌లు పంపిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలోని మోషన్ సెన్సార్లు భూమిలోని సూక్ష్మ కదలికలను గుర్తిస్తాయి.

వివరాలు 

ముందే హెచ్చరించిన గూగుల్

ఒకే ప్రాంతంలోని అనేక ఫోన్లు ఒకేసారి కదలికలను నమోదు చేస్తే, గూగుల్ అల్గారిథమ్ వాటిని విశ్లేషించి భూకంప తీవ్రతను అంచనా వేసి కేవలం కొన్ని సెకన్లలోనే హెచ్చరికలను పంపిస్తుంది. భారత్‌లో కూడా 2023 నుంచి ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ సదుపాయం పనిచేస్తోంది.

Advertisement