LOADING...
Video: కువైట్‌లో కూలిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం..  
కువైట్‌లో కూలిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం..

Video: కువైట్‌లో కూలిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం..  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ యుద్ధం మూడో రోజుకు చేరుకున్న వేళ మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కువైట్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానం కూలిపోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒక పైలట్ విమానం నుంచి బయటకు దూకిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన అమెరికా వైమానిక దళం మధ్య జరిగిన 'ఫ్రెండ్లీ ఫైర్' కారణంగా జరిగి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నా, దీనిపై యూఎస్ సెంట్రల్ కమాండ్ లేదా పెంటగాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

వివరాలు 

మరింత మంది మరణిస్తారు: ట్రంప్ అంచనా  

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు . ఇక ముందు కూడా మరిన్ని ప్రాణనష్టాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. "యుద్ధం ముగిసేలోపు ఇంకా మరికొందరు సైనికులు ప్రాణాలు కోల్పోవచ్చు... పరిస్థితి అలానే ఉంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Advertisement