LOADING...
US flight Video: విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వేపై అడ్డంగా మరో జెట్‌.. తప్పిన ప్రమాదం
విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వేపై అడ్డంగా మరో జెట్‌.. తప్పిన ప్రమాదం

US flight Video: విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వేపై అడ్డంగా మరో జెట్‌.. తప్పిన ప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా షికాగో మిడ్‌వే అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒక్కదానికొకటి ఎదురుగా రావడంతో త్రుటిలో ఘోర ప్రమాదం సంభవించేదేమో కానీ, పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెను విషాదం తప్పింది. ఏం జరిగింది? అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:47 గంటలకు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఒమాహా నుంచి షికాగో మిడ్‌వే ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. అది రన్‌వే 31Cపై ల్యాండ్ కావడానికి సిద్ధమవుతోంది. అయితే, అదే సమయంలో ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అనుకోకుండా అదే రన్‌వేపై దూసుకువచ్చింది. దీన్ని గమనించిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అప్పటికే విమానం చక్రాలు నేలను తాకినప్పటికీ, పైలట్ తన చాకచక్యంతో విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపాడు.

వివరాలు 

తప్పిన పెను ప్రమాదం! 

పైలట్ల అప్రమత్తత వల్లే ఈ రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. ఛాలెంజర్ 350 బిజినెస్ జెట్ ఎలాంటి అనుమతులు లేకుండా అకస్మాత్తుగా రన్‌వేపైకి ప్రవేశించిందని FAA వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం కొన్ని రోజుల క్రితం వాషింగ్టన్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద రన్‌వేపై ల్యాండ్ అవుతున్న PSA ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని ఓ సైనిక హెలికాప్టర్ ఢీకొట్టిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానాశ్రయంలోని దృశ్యాలు