
Vienna Convention: వియన్నా కన్వెన్షన్.. దాని ప్రాముఖ్యత ఏంటి? భారత్-పాకిస్తాన్ వివాదాల్లో దీని పాత్ర ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు పత్రికలు పంపడాన్ని పాకిస్తాన్ నిషేధించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ, ఈ చర్య పాకిస్తాన్ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని, అంతర్జాతీయ చట్టమైన వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. ఈ పరిణామంతో వియన్నా కన్వెన్షన్ అంటే ఏమిటి? దాని కింద ఏ హక్కులు లభిస్తాయి? అనేది మరోసారి చర్చనీయాంశమైంది. 1961లో స్వతంత్ర, సార్వభౌమ దేశాల మధ్య దౌత్య సంబంధాల కోసం వియన్నా సమావేశం మొదటిసారిగా జరిగింది. ఇందులో విదేశీ దేశాల్లో పనిచేసే దౌత్యవేత్తలకు ప్రత్యేక హక్కులు కల్పించే అంతర్జాతీయ ఒప్పందానికి రూపకల్పన జరిగింది. దీని ఆధారంగా, దౌత్యవేత్తల రక్షణకు సంబంధించిన నిబంధనలు చట్టబద్ధం చేశారు.
Details
వియన్నా ఒప్పందం కింద లభించే హక్కులు
* ఆతిథ్య దేశం తమ దేశంలో ఉన్న ఇతర దేశాల దౌత్యవేత్తలకు ప్రత్యేక హోదా కల్పించాలి. * ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ లా కమిషన్ రూపొందించింది, 1964లో ఇది అమల్లోకి వచ్చింది. * 2017 ఫిబ్రవరి నాటికి 191 దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. * మొత్తం 54 నిబంధనలు ఇందులో ఉన్నాయి. * ముఖ్యంగా, ఏ దేశం కూడా మరొక దేశ దౌత్యవేత్తను చట్టపరమైన కారణాలతోనూ అరెస్ట్ చేయరాదు. * దౌత్యవేత్తలు ఆతిథ్య దేశంలో కస్టమ్స్ పన్నుల నుంచి మినహాయింపు పొందుతారు.
Details
1963లో కొత్త నిబంధన
ఐక్యరాజ్యసమితి 'వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్' అనే కొత్త ఒప్పందాన్ని రూపొందించింది. * ఆర్టికల్ 31 ప్రకారం, ఆతిథ్య దేశం రాయబార కార్యాలయంలో అనుమతి లేకుండా ప్రవేశించకూడదు, అలాగే ఆ కార్యాలయం భద్రతా బాధ్యత కూడా ఆతిథ్య దేశానిదే. * ఆర్టికల్ 36 ప్రకారం, ఒక దేశం తన భూభాగంలో ఉన్న విదేశీ పౌరుడిని అరెస్టు చేస్తే, సంబంధిత దేశ రాయబార కార్యాలయానికి వెంటనే సమాచారం అందించాలి.
Details
భారత్-పాకిస్తాన్ ఒప్పందం
* అరెస్టైన విదేశీ పౌరుడి అభ్యర్థన మేరకు పోలీసులు సంబంధిత రాయబార కార్యాలయం లేదా దౌత్యవేత్తకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం ఇవ్వాలి. * ఆ ఫ్యాక్స్‌లో అరెస్టు వ్యక్తి పేరు, అరెస్టు ప్రదేశం, కారణం వివరంగా ఉండాలి. * గూఢచర్యం లేదా ఉగ్రవాదం వంటి జాతీయ భద్రతా కేసుల్లో ఈ అనుమతులు ఇవ్వకూడదని నిబంధన ఉంది, ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఈ అంశంపై పరస్పర ఒప్పందం కుదిరినప్పుడు. * భారత్, పాకిస్తాన్ 2008లో ఇలాంటి ఒప్పందంపై సంతకం చేశాయి.