
Zelenskyy: ఒప్పందం ఉల్లంఘన.. రష్యా దాడులు చేస్తూనే ఉంది.. జెలెన్‌స్కీ
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో చర్చించిన విషయం తెలిసిందే.
ఈ చర్చల అనంతరం, ఉక్రెయిన్‌లోని ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు ఆపేందుకు యూఎస్-రష్యా మధ్య ఒప్పందం కుదిరింది.
అయితే ఈ ఒప్పందం ఉల్లంఘించారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆరోపణలు చేశారు.
Details
రష్యా మళ్లీ డ్రోన్ దాడులకు తెగబడింది
జెలెన్‌స్కీ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో రష్యా అసలు ఉద్దేశ్యం ఏంటో తాజా దాడులతో స్పష్టమైందని అన్నారు. దాదాపు 40 డ్రోన్లు ఉక్రెయిన్ భూభాగాన్ని తాకాయి.
ఇవి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. సుమీ ప్రాంతంలోని ఆస్పత్రితో పాటు కీవ్, జటోమిర్, చెర్నిహివ్ ప్రాంతాల్లో రాత్రివేళ తీవ్ర దాడులు జరిగాయని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్ పౌరుల జీవితాలను అస్తవ్యస్తం చేసేందుకు మాస్కో ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నదని విమర్శించారు.
Details
జర్మన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు
ఈ దాడులపై జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ కూడా స్పందించారు. "పుతిన్ శాంతి నెలకొల్పాలని అనుకుంటున్నాడా? లేక యుద్ధాన్ని మరింత పొడిగించాలని చూస్తున్నాడా?" అని ఆయన ప్రశ్నించారు.
ట్రంప్ ఇప్పుడే స్పందించి, రష్యా వైఖరిపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు.
ట్రంప్ - పుతిన్ ఒప్పందం ఏమిటి?
యుద్ధాన్ని నిలిపే చర్యల్లో భాగంగా, అమెరికా నేతృత్వంలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో చర్చలు జరిగాయి.
ఈ చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించగా, రష్యా మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదు.
మంగళవారం ట్రంప్, పుతిన్ ఫోన్‌లో మాట్లాడినప్పుడు ట్రంప్, నెల రోజుల పాటు ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని సూచించగా, పుతిన్ అంగీకరించినట్లు సమాచారం.
Details
యుద్ధ ఖైదీల మార్పిడిపై క్రెమ్లిన్ ప్రకటన
క్రెమ్లిన్ ప్రకారం, బుధవారం రష్యా-ఉక్రెయిన్ పరస్పరం 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోనున్నాయి.
ఇందులో, తీవ్రంగా గాయపడిన 23 మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా అప్పగించనుందని తెలిపింది.
అదే సమయంలో అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సైనిక సహాయం నిలిపివేయాలని పుతిన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కానీ తాజా దాడులతో, మాస్కో నిజమైన ఆలోచన ఏమిటనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.