NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి 
    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి

    Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 07, 2024
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొంతకాలంగా డ్రోన్‌ బాంబు దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య స్థానికంగా మరోసారి హింస చెలరేగడం కలకలం రేపింది.

    ఈ ఘటన వల్ల జిరిబామ్‌ జిల్లాలో ఐదుగురు మృతి చెందారు.

    శనివారం తొలుత ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపగా.. ఇదికాస్త ఇరువర్గాల మధ్య కాల్పులకు దారితీసింది. ఈ క్రమంలోనే మరో నలుగురు సాయుధులు మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

    మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి.

    బిష్ణుపుర్‌ జిల్లాలో రాకెట్‌ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.

    Details

    మూడు బంకర్లను ధ్వంసం చేసిన ప్రత్యేక బలగాలు

    రాకెట్‌ దాడుల ఘటనల్లో బిష్ణుపుర్‌ జిల్లాలో ఓ వృద్ధుడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మొదటి దాడి తెల్లవారుజామున 4.30 గంటలకు ట్రోంగ్లావ్‌బిలో జరిగింది.

    రెండోవ దాడి మధ్యాహ్నం 3 గంటలకు మొయిరంగ్‌లోని మాజీ సీఎం మైరెంబమ్‌ కొయిరెంగ్‌ నివాస ఆవరణలో రాకెట్‌ పడటంతో అందులో అమర్చిన బాంబు పేలింది.

    దీంతో ఓ వృద్ధుడు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు.

    ఈ నేపథ్యంలోనే చూరాచాంద్‌పుర్‌లోని మువాల్‌సంగ్‌, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్‌‌ను బలగాలు చేపట్టి, మూడు బంకర్లను కూల్చివేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    ప్రపంచం

    తాజా

    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్
    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్

    మణిపూర్

    మణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు  భారతదేశం
    రావణకాష్టంగా మణిపూర్‌.. ముఖ్యమంత్రి నివాసంపై ఆందోళనకారుల దాడి బీరెన్ సింగ్
    మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు  హత్య
    మణిపూర్‌లో మంత్రి ఇంటి బయట పేలుడు.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా ఇద్దరికి గాయాలు  ఇంఫాల్

    ప్రపంచం

    UK : 16 ఏళ్ల బాలికపై విచిత్రమైన గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు అమెరికా
    Nikolai Ryzhkov: సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని కన్నుమూత  అంతర్జాతీయం
    Paul Alexander: ఇనుప ఊపిరితిత్తుల 'పోలియో పాల్' మృతి  అంతర్జాతీయం
    Astra Zeneca: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను రీకాల్ చేసిన ఆస్ట్రాజెనెకా  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025