Page Loader
Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. మహిళలు, చిన్నారులు మిస్సింగ్‌తో సెర్చ్ ఆపరేషన్
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. మహిళలు, చిన్నారులు మిస్సింగ్‌తో సెర్చ్ ఆపరేషన్

Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. మహిళలు, చిన్నారులు మిస్సింగ్‌తో సెర్చ్ ఆపరేషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఘర్షణల వల్ల పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. ప్రస్తుతం వారి జాడను తెలుసుకోవడానికి భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వెల్లడించిన ప్రకారం, ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల కోసం సెర్చ్‌ ఆపరేషన్లు కొనసాగిస్తున్నామని చెప్పారు. మణిపూర్ లో సోమవారం భద్రతా బలగాలు మిలిటెంట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది కుకీ మిలిటెంట్లు మరణించగా, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Details

 సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి

ఒక జవాన్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ కాల్పులు జిరిబామ్‌ జిల్లాలో సైనికుల్లా దుస్తులు ధరించిన మిలిటెంట్లు, అధునాతన ఆయుధాలతో బోరోబెక్రా పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతోనే ప్రారంభమయ్యాయి. ఆ తరువాత, సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపైనా దాడి చేసి, సమీప గ్రామంలో అనేక దుకాణాలను నిప్పు పెట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మిలిటెంట్ల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. తాజా ఘటనతో అక్కడ మరోసారి ఉత్కంఠ నెలకొంది.