LOADING...
US Embassy: వీసా ప్రివిలేజ్ మాత్రమే.. అక్రమ ప్రవేశంపై US ఎంబసీ గట్టి హెచ్చరిక!
వీసా ప్రివిలేజ్ మాత్రమే.. అక్రమ ప్రవేశంపై US ఎంబసీ గట్టి హెచ్చరిక!

US Embassy: వీసా ప్రివిలేజ్ మాత్రమే.. అక్రమ ప్రవేశంపై US ఎంబసీ గట్టి హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం వలసదారులపై మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేసింది. అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తే నిర్బంధం, బహిష్కరణ మాత్రమే కాకుండా భవిష్యత్తులో శాశ్వతంగా వీసా అనర్హతకూ గురవుతారని స్పష్టం చేసింది. అంతేకాకుండా అక్రమ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తే జైలు శిక్ష అనుభవించకతప్పదని, స్వదేశానికి తిరిగి పంపించబడతారనీ, శాశ్వత ముద్ర పడతుందని వెల్లడించింది.

Details

చట్టాన్ని ఉల్లంఘిస్తే వీసా రద్దు

అమెరికాకు వెళ్లే విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న రాయబార కేంద్రం వీసా అనేది ప్రివిలేజ్‌ మాత్రమే, అది హక్కు కాదని తేల్చిచెప్పింది. వీసా జారీ చేసిన తర్వాత కూడా నిరంతర స్క్రీనింగ్‌ ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులు ఆ వీసాను రద్దు చేయగలరని వివరించింది. అంతేకాకుండా స్టూడెంట్‌ వీసా లేదా విజిటర్‌ వీసాపై వెళ్లేవారు మాదకద్రవ్యాల వినియోగం, అమెరికా చట్టాల ఉల్లంఘన వంటి కార్యకలాపాల్లో పాల్గొంటే భవిష్యత్తులో అమెరికా వీసా పొందే అర్హతను శాశ్వతంగా కోల్పోతారని స్పష్టంగా హెచ్చరించింది.