Hawaii volcano: హవాయిలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. 165 అడుగుల వరకు ఎగసిపడుతున్న లావా!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని హవాయిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 100 అడుగులకుపైగా లావా ఎగసిపడుతోంది.
హవాయిలోని అగ్నిపర్వత ప్రాంతంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత చురుకైన కిలోవియా శిఖరంపై బిలం నుంచి గతేడాది డిసెంబర్ 23న విస్ఫోటనం ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు.
క్రమంగా ఆ విస్ఫోటనం భారీ ఫౌంటెయిన్‌లా మారి మంగళవారం ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తుకు లావా విస్ఫోటనమైందని హవాయి అగ్నిపర్వత అబ్జర్వేటరీ పేర్కొంది.
Details
'నో ఫ్లై జోన్'గా ప్రకటన
ప్రస్తుతం లావా ఎగసిపడే ఎత్తు 150 నుంచి 165 అడుగుల మధ్య ఉంటోందని, మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ అగ్నిపర్వతం ఎత్తైన ప్రాంతంలో ఉన్నందున స్థానిక నివాసితులకు ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
అయితే అగ్నిపర్వతం వద్ద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని 'నో ఫ్లై జోన్'గా ప్రకటించారు. పర్వత సమీపానికి ప్రజలు వెళ్లకుండా కఠిన ఆంక్షలు విధించారు.