తదుపరి వార్తా కథనం
Zelensky: పొక్రొవిస్క్‌లో యుద్ధం ముదురుతోంది.. 1.70 లక్షల సైనికుల మోహరింపు: జెలెన్‌స్కీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 01, 2025
09:59 am
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ తూర్పు దొనెస్క్ ప్రాంతంలో తీవ్ర యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత కీలకమైన పొక్రొవిస్క్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. దాదాపు 1.70 లక్షల రష్యా సైనికులు ఆ ప్రాంతంలో దళాలను విస్తరించినట్లు ఆయన తెలిపారు. అయితే, తమ బలగాలు రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కొంటున్నాయని, పొక్రొవిస్క్‌ను రష్యా చేతుల్లోకి వెళ్లనివ్వమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఇకపోతే ఉక్రెయిన్‌లోని కొన్ని కీలక నగరాలు ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వస్తున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన ప్రకటనల తర్వాత, జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో యుద్ధం మళ్లీ తీవ్రస్థాయికి చేరినట్లు సమాచారం.