
Bilawal Bhutto: సింధూ జలాలు ఆపితే యుద్ధం తప్పదు.. హెచ్చరించిన బిలావల్ భుట్టో!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ తరచూ యుద్ధ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇటీవల ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యల తర్వాత, ఇప్పుడు ఆ దేశ రాజకీయ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా మళ్లీ అదే ధోరణిలో హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ భారత్ సింధూ జలాలను ఆపేస్తే, పాకిస్థాన్‌కు యుద్ధం తప్ప మరే మార్గం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్ తమకు భారీ నష్టం కలిగించిందని, దేశ ప్రజలందరూ ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఏకమై పోరాడాలని భుట్టో పిలుపునిచ్చారు. సింధ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన భుట్టో, మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వ చర్యలు పాకిస్థాన్ ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగించాయని విమర్శించారు.
Details
ప్రజలు యుద్ధానికి సిద్ధంగా ఉండారు
ఆరు నదులను తిరిగి పొందేందుకు పాకిస్థానీలు శక్తివంతంగా ఉన్నారని, భారత్ ఇదే వైఖరితో ముందుకు సాగితే తమకు మార్గం ఒక్కటే మిగులుతుందని, జాతి ప్రయోజనాలను కాపాడుకునేందుకు యుద్ధమే శరణ్యమని ఆయన స్పష్టం చేశారు. మేము యుద్ధాన్ని ప్రారంభించాలనే ఉద్దేశం లేనప్పటికీ, భారత్ సింధూర్ తరహా దాడి చేయాలని చూస్తే, పాకిస్థాన్‌లోని ప్రతి ప్రావిన్స్ ప్రజలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని భుట్టో హెచ్చరించారు. ఆ యుద్ధంలో భారత్ ఓటమి చెందుతుందని, తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన హితవు పలికారు.