LOADING...
Iran War: నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ తీవ్ర హెచ్చరిక
నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ తీవ్ర హెచ్చరిక

Iran War: నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ తీవ్ర హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతోంది. యుద్ధం ప్రారంభమై ఇప్పటికే 16 రోజులు పూర్తయ్యాయి. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇజ్రాయెల్‌, యూఎస్‌ కలిసి ఇరాన్‌పై దాడులు జరిపాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖ‌మేనీ మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరాన్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహును హతమార్చుతామని ఇరాన్ ఆదివారం హెచ్చరించింది. పిల్లలను చంపిన నేరస్థుడు బతికే ఉన్నంత వరకు మేము అతన్ని పూర్తి శక్తితో వెంబడించి చంపుతామ‌ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయిల్ ఇరాన్‌పై జరిపిన దాడుల్లో 160 మందికి పైగా స్కూల్ విద్యార్థులు మరణించినట్లు సమాచారం.

Details

తమ నాయకుడు సురక్షితంగా ఉన్నారు

మినాబ్ నగరంలోని ఒక పాఠశాలపై దాడి జరగడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, నెతన్యాహూ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఆయన మరణించారా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల నెతన్యాహూకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో అది కృత్రిమ మేధస్సు(ఏఐ)తో ఎడిట్ చేసిన వీడియో అని కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నెతన్యాహూ మరణించారన్న వదంతులు కూడా సోషల్ మీడియాలో వ్యాపించాయి. అయితే ఈప్రచారాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఖండించింది. తమ నాయకుడు సురక్షితంగా ఉన్నారని, ఆయన మరణించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.

Advertisement