LOADING...
Donald Trump: ట్రంప్‌ను హతమారుస్తాం… అమెరికా టాప్ లీడర్లకు అల్‌ఖైదా హెచ్చరిక!
ట్రంప్‌ను హతమారుస్తాం… అమెరికా టాప్ లీడర్లకు అల్‌ఖైదా హెచ్చరిక!

Donald Trump: ట్రంప్‌ను హతమారుస్తాం… అమెరికా టాప్ లీడర్లకు అల్‌ఖైదా హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అరేబియన్‌ పెనున్సులా (AQAP) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆయన ముఖ్య అధికారులపై దాడులు చేస్తామని బహిరంగ హెచ్చరికలు చేసింది. ఈ ప్రకటనను ఆ సంస్థకు కొత్తగా అధిపతిగా నియమితుడైన సాద్‌ బిన్‌ అతేఫ్‌ అల్‌-అవ్లాకీ విడుదల చేశాడు. దాదాపు 30 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో, అమెరికా పరిపాలనలో ఉన్న అనేక ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు లక్ష్యాలుగా మారతారని చెప్పడం గమనార్హం. అల్‌-అవ్లాకీపై ఇప్పటికే అమెరికా ప్రభుత్వం 6 మిలియన్ డాలర్ల(సుమారు రూ.50 కోట్లు)రివార్డు ప్రకటించింది. 2024 మార్చిలో అతడు AQAP కి నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. వీడియోలో గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి ప్రతీకారంగా అమెరికా లక్ష్యాలపై తీవ్ర దాడులకు దిగాలన్న పిలుపునిచ్చాడు.

Details

వీరే లక్ష్యంగా దాడులు

డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్స్, ఎలాన్ మస్క్వం టి ప్రముఖులు, అలాగే శ్వేతసౌధ సిబ్బంది, వారు సన్నిహితంగా ముడిపడిన వారందరిని లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొన్నాడు. గతంలో అమెరికాలో యూదులపై జరిగిన దాడులను అల్‌-అవ్లాకీ సమర్థించడమే కాక, వారి కోసం ఎక్కడా సురక్షిత స్థలం ఉండకూడదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినాడు. ప్రస్తుతం యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ AQAP విభాగం గతంలో సౌదీ, యెమెన్‌లో వేర్వేరు భాగాలుగా కార్యకలాపాలు సాగించింది.

Details

అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల జాబితాలో అల్ ఖైదా

అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం అనంతరం ఈ పెనున్సులా విభాగం అతి ప్రమాదకరంగా మారిందని గణన ఉంటుంది. ఈ గ్రూపు గతంలో 2009లో జరిగిన అండర్‌వేర్ బాంబర్ కుట్ర, 2015లో ఫ్రాన్స్‌లోని చార్లీ హెబ్డో పత్రికపై దాడి లాంటి సంఘటనలతో ప్రపంచాన్ని హడలెత్తించింది. దీంతో అమెరికా విదేశాంగ శాఖ ఈ గ్రూపును అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. AQAP ప్రస్తుతం అల్‌ఖైదాలో అత్యంత చురుకుగా పనిచేస్తున్న విభాగంగా ఉన్నట్లు నిఘా సంస్థలు స్పష్టం చేశాయి.