LOADING...
Abdul Rauf: దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ సంచలన వ్యాఖ్యలు
దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Abdul Rauf: దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు సన్నిహితుడైన అబ్దుల్ రవూఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దిల్లీని ఆక్రమించి పెళ్లికూతురుగా మార్చుతామని, భారత్‌పై తీవ్ర దాడులు చేపడుతామని ఆయన ప్రకటించాడు. ఇదే క్రమంలో భారత విమాన దళంపై కూడా నోరుపారేశాడు. అబ్దుల్ రవూఫ్, లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. పాక్‌ ఆర్మీ అతడిని సాధారణ పౌరుడిగా పేర్కొన్నప్పటికీ, భారత్‌పై ఉగ్రప్రయాణాలకు పిలుపునిస్తూ చేసిన ప్రసంగాల్లో అతడి ఉగ్ర భావజాలం స్పష్టమైంది. రవూఫ్ తాజాగా చేసిన ప్రసంగంలో జమ్మూ-కశ్మీర్‌లో సాయుధ పోరాటం ఇంకా కొనసాగుతుందనా చెప్పడంతో పాటు వివాదం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించాడు.

Details

దిల్లీని స్వాధీనం చేసుకుంటాం

ఇక ఎల్ఐటీ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ రెహమాన్ మక్కీపై సన్నిహితంగా, భారత రాజధాని దిల్లీని స్వాధీనం చేసుకోవడం తమ గ్రూపు ప్రధాన లక్ష్యమని రవూఫ్ బహిరంగంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా దిల్లీని ఆక్రమిస్తామన్న నినాదాలను కూడా ఆయన ప్రేరేపించాడు. భారత సైనిక శక్తిపై రవూఫ్ తీవ్ర విమర్శలు చేశారు. రఫేల్ యుద్ధవిమానాలు, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్‌లు అసమర్థంగా ఉన్నాయని, భారత వైమానిక దళం పాక్ గగనతలలోకి ప్రవేశించే ధైర్యం చూపించలేరని తెలిపారు. అంతే కాక, పాక్‌ వద్ద మాత్రమే అసలు అణ్వాయుధాలు ఉన్నాయని ఆయన గర్వంగా పేర్కొన్నారు.

Advertisement