LOADING...
Welcome Modi: నమస్తే-షాలోమ్: ఇజ్రాయెల్ ఫ్రంట్‌పేజీలో మోదీ పర్యటన ప్రత్యేకం
నమస్తే-షాలోమ్: ఇజ్రాయెల్ ఫ్రంట్‌పేజీలో మోదీ పర్యటన ప్రత్యేకం

Welcome Modi: నమస్తే-షాలోమ్: ఇజ్రాయెల్ ఫ్రంట్‌పేజీలో మోదీ పర్యటన ప్రత్యేకం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ద్వైపాక్షిక రక్షణ రంగం,వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరారు (PM Modi Israel visit). ఈ పర్యటనకు అక్కడి మీడియా విశేష ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ పత్రిక The Jerusalem Post తన ఫ్రంట్‌పేజీలో ఈ వార్తను ప్రధానంగా ప్రచురించడం విశేషం. "నమస్తే" (హిందీ),"షాలోమ్" (హిబ్రూ) అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించడం ద్వారా రెండు దేశాల స్నేహాన్ని ప్రతిబింబించింది. ఇజ్రాయెల్ అధికార భాష హిబ్రూ. ఆ భాషలో "షాలోమ్" అంటే "శాంతి" అనే అర్థం వస్తుంది. అదే పదాన్ని అభివాదంగా కూడా ఉపయోగిస్తారు. ఆ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ జ్వికా క్లీన్ బుధవారం ఎడిషన్ ఫ్రంట్‌పేజీని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.

వివరాలు 

41 వేల మంది ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం

మోదీ అభివాదం చేస్తున్న చిత్రాన్ని ప్రధానంగా ప్రచురించడంతో పాటు, భారత్-ఇజ్రాయెల్ సంబంధాలపై వివరణాత్మక కథనాలను కూడా అందించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు మోదీ ఇజ్రాయెల్‌లో అడుగుపెడతారు. 2017లో ఆయన తొలిసారిగా ఆ దేశాన్ని సందర్శించారు.ఈసారి Knesset (ఇజ్రాయెల్ పార్లమెంట్)లో ప్రసంగించనున్నారు. ఇప్పటి వరకు ఏ భారత ప్రధాని కూడా అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించిన దాఖలాలు లేవు. తాజా పర్యటన సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు గాజా ప్రాంత పరిస్థితులు,పశ్చిమాసియాకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. అదనంగా, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న సుమారు 41 వేల మంది ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కావచ్చని సమాచారం. ఈ పర్యటన ద్వారా భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

The Jerusalem Post ఫ్రంట్‌ పేజీలో వార్త

Advertisement