Iran Attack: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. జోర్డాన్ సరిహద్దు ప్రాంతంలో ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) అధికారికంగా వెల్లడించింది. జులై 17న జరిగిన ఈ దాడిలో మరో అమెరికా సైనికుడు ఆచూకీ లేకుండా పోయినట్లు, నలుగురు సైనికులు తీవ్ర గాయాలపాలైనట్లు పెంటగాన్ వెల్లడించింది.
వివరాలు
16 మంది అమెరికా సైనికులు మృతి..
ఈ తాజా ఘటనతో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 16కు చేరింది.
అలాగే 430 మందికిపైగా సైనికులు వివిధ దాడుల్లో గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా అమెరికాపై తీవ్ర స్థాయిలో విమర్శలు, హెచ్చరికలు చేశారు.
"యుద్ధాన్ని అమెరికానే ప్రేరేపిస్తోంది. ఇప్పుడు అదే దాని పరిణామాలను ఎదుర్కొంటోంది.
ఇరాన్‌తో పాటు దానికి మద్దతుగా ఉన్న 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' దళాలు అమెరికా ఎన్నటికీ మరచిపోలేని గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.