
America: భద్రతాధికారులను భయపెట్టిన అనుమానాస్పద వస్తువు.. వైట్‌హౌస్‌కు తాళం…
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కి తాత్కాలికంగా లాక్ వేసారు. మంగళవారం నాడు అనుమానాస్పద వస్తువు ఒకటి వైట్‌హౌస్ వైపు దూసుకురావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హుటాహుటిన స్పందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రత కారణంగా వైట్‌హౌస్‌కు తాళం వేసి, కొద్ది సేపు అక్కడి కార్యకలాపాలను నిలిపివేశారు. అనంతరం పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత మళ్లీ కార్యకలాపాలను పునఃప్రారంభించి, భద్రతను మరింత పెంచారు.
వివరాలు
నార్త్ లాన్ ప్రాంతంలో ప్రవేశం నిలిపివేత
ఈ ఘటన విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్‌మహాన్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు వైట్‌హౌస్ ప్రెస్ పూల్‌కు చెందిన మీడియా ప్రతినిధులు ఎదురుచూస్తున్న సమయంలో జరిగింది. ఇది మధ్యాహ్నం ముందే జరిగింది. వెంటనే విలేకరులను భద్రత నిమిత్తం ఇంటి లోపలికి తీసుకెళ్లారు. అలాగే, నార్త్ లాన్ ప్రాంతంలో ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు. అనుమానాస్పద వస్తువు ఏమిటన్నది అధికారులు ఇంకా బయటపెట్టలేదు. కానీ, వైట్‌హౌస్ సందర్శనకు వచ్చిన ఒక పర్యాటకుడు తన వ్యక్తిగత వస్తువునో లేదా మొబైల్ ఫోన్‌ను అలా విసిరి ఉండవచ్చని స్థానిక అధికారుల నుంచి సమాచారం అందింది.
వివరాలు
ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వని వైట్‌హౌస్
"ఎవరైనా తమ ఫోన్‌ను కంచె మీదుగా విసిరి ఉండవచ్చు" అని ట్రంప్ ప్రచార బృందానికి చెందిన ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, సీక్రెట్ సర్వీస్ మాత్రం ఆ విషయాన్ని అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఉదయం 11:56 గంటలకు నార్త్ లాన్‌కు విలేకరులు మళ్లీ ప్రవేశించేలా అనుమతించారు. అలాగే, మధ్యాహ్నం 12:20 సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో జరిగే ఓ కార్యక్రమానికి బయలుదేరే ముందు విలేకరులు పామ్ రూమ్‌లో తిరిగి సమావేశమయ్యారు. ఈ భద్రతా ఉల్లంఘనపై వైట్‌హౌస్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
వివరాలు
ఇంతకముందు కూడా ఇలాంటి ఘటనలు
ఇదే తరహాలో వైట్‌హౌస్‌ను లాక్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2019లో అనుమానాస్పద పార్సల్ వచ్చిన నేపథ్యంలో వైట్‌హౌస్ కు తాత్కాలికంగా తాళం వేసారు. అలాగే, 2018లో వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పద వాహనం కనిపించడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు అప్రమత్తమై అప్పట్లోనూ భవనాన్ని లాక్ చేశారు.