Page Loader
India-US Tariffs: అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ 100శాతం సుంకాలు వసూలు.. ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయం:  వైట్‌హౌస్‌ 
ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయం: వైట్‌హౌస్‌

India-US Tariffs: అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ 100శాతం సుంకాలు వసూలు.. ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయం:  వైట్‌హౌస్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా భారత్‌తో పాటు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏప్రిల్ 2న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. దీనికి ఎలాంటి మినహాయింపులు ఉండవని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. తాజాగా, ఈ అంశంపై వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ స్పందించారు. భారత్ అమెరికా ఉత్పత్తులపై 100% సుంకాలను (Tariffs) విధిస్తున్నదని ఆమె తెలిపారు. ఇతర దేశాలు అధిక సుంకాలను విధించడం వల్ల అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయడం కష్టతరమవుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడే ప్రతీకార సుంకాలు విధించడం సమయోచితమని ఆమె వ్యాఖ్యానించారు.