LOADING...
Pakistan: అమెరికా-ఇరాన్ చర్చలకు ముందు పాకిస్థాన్ ఎందుకు యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి పంపింది?
అమెరికా-ఇరాన్ చర్చలకు ముందు పాకిస్థాన్ ఎందుకు యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి పంపింది?

Pakistan: అమెరికా-ఇరాన్ చర్చలకు ముందు పాకిస్థాన్ ఎందుకు యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి పంపింది?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎప్పుడు ముగుస్తాయా అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఆ ప్రాంతం ఉత్కంఠభరితంగా మారింది. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా మారుతోంది. ఇదిలా ఉండగా, ఈ కీలక చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ వైమానిక దళం పెద్ద స్థాయిలో కార్యాచరణ ప్రారంభించి యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, గగనతలంలో ఇంధనం నింపే విమానాలు, రవాణా విమానాలను మధ్యప్రాచ్య ప్రాంతంలో మోహరించింది. ఈ చర్యలు చర్చల భద్రతకు కీలకంగా భావిస్తున్నారు.

వివరాలు 

1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇంత పెద్ద స్థాయిలో చర్చలు ఇదే మొదటిసారి

చర్చలను భంగం కలిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇరాన్ నుంచి వచ్చే ప్రతినిధుల విమానాలకు ప్రత్యేక రక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఏ విధమైన అంతరాయం లేకుండా చర్చలు సజావుగా జరిగేలా పాకిస్తాన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇంత పెద్ద స్థాయిలో ఈ తరహా చర్చలు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

వివరాలు 

ప్రతిష్టను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న పాక్ 

అమెరికా-ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఈ చర్చలు ముగింపు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ఇస్లామాబాద్ వైపు మళ్లింది. ఇక మరోవైపు, ఈ చర్చల ద్వారా పాకిస్తాన్ తన ప్రతిష్టను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఏ చిన్న సంఘటన జరిగినా దేశ ప్రతిష్టకు భంగం కలగొచ్చని ఆందోళన కూడా ఉంది. అందుకే పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాల సహకారంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తోంది.

Advertisement