Jayme Leagh Franklin: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పక్కన ఉన్న మహిళ ఎవరు? వైరల్ ప్రచారం వెనుక నిజం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన ఓ మహిళ నిల్చున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రంప్ ఓ కీలక ఫైల్‌పై సంతకం చేస్తున్న సమయంలో ఆమె ఆయనకు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నారని, నిద్రపోకుండా మేల్కొలుపుతున్నారని 'ఎక్స్' సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం జరిగింది. దీంతో అసలు ఆ మహిళ ఎవరు? ఆమె అలా ఎందుకు చేశారు? అనే చర్చ మొదలైంది.
వివరాలు
వైరల్ ప్రచారంపై మహిళ క్లారిటీ
ఈ ప్రచారం ఎక్కువ కావడంతో సదరు మహిళ స్వయంగా స్పందించారు.
ఆమె పేరు జేమీ లీ ఫ్రాంక్లిన్. కన్జర్వేటివ్ మీడియా, లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'ది కన్జర్వేట్యుర్'వ్యవస్థాపకురాలు, సీఈఓగా ఆమె తెలిపారు.
సోమవారం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఈ ఘటన జరిగింది.చిన్నపిల్లల వ్యాక్సిన్లకు సంబంధించి కొత్త సిఫార్సులతో కూడిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రంప్,ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ మధ్యలో జేమీ లీ ఫ్రాంక్లిన్ నిల్చున్నారు.
ఆ సమయంలో ఆమె పదేపదే తల ఊపుతూ కనిపించారు. అదే సమయంలో తన చేతిని కడుపుపై ఉంచుకున్నారు.
ఈ దృశ్యాన్ని ఆధారంగా చేసుకున్న కొందరు నెటిజన్లు తమకు తోచిన కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
వివరాలు
తాను గర్భవతినని వెల్లడించిన జేమీ
ఆమె చేతితో ఏదో బటన్ నొక్కి ట్రంప్‌ను మెలకువగా ఉంచుతున్నారని వింత వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై జేమీ లీ ఫ్రాంక్లిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తన గురించి చేసిన ఓ పోస్టుకు స్పందిస్తూ అసలు కారణాన్ని వెల్లడించారు.
తాను గర్భవతినని, అందుకే తన చేతిని కడుపుపై పెట్టుకున్నానని స్పష్టం చేశారు. దీంతో ట్రంప్‌కు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నారంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.
ఈ కార్యక్రమం అనంతరం జేమీ 'ఎక్స్'లో ఓ పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి ఓవల్ ఆఫీస్‌లో ఉండటం గౌరవంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
ఎవరీ జేమీ లీ ఫ్రాంక్లిన్?
'న్యూస్‌వీక్' కథనం ప్రకారం.. జేమీ లీ ఫ్రాంక్లిన్ నార్త్ కరోలినాకు చెందినవారు.
గతంలో ఆమె ట్రంప్ ప్రభుత్వంలో పనిచేశారు. 2020లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
2019లో అమెరికా సెనేట్‌లో లెజిస్లేటివ్ ఇంటర్న్‌గా జేమీ తన కెరీర్‌ను ప్రారంభించారు.
అనంతరం 2020లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కోఅలిషన్స్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత వైట్‌హౌస్‌లో డైరెక్టర్ ఆఫ్ కరస్పాండెన్స్‌గా కూడా పనిచేశారు.
వివరాలు
'ది కన్జర్వేట్యుర్'లో ఏం చేస్తారు?
ప్రస్తుతం జేమీ లీ ఫ్రాంక్లిన్ నిర్వహిస్తున్న 'ది కన్జర్వేట్యుర్' రాజకీయాలు, సంస్కృతి, విశ్వాసం, ఫ్యాషన్, అందం వంటి విభిన్న అంశాలను కలిపి కంటెంట్ అందించే మీడియా, లైఫ్‌స్టైల్ సంస్థగా కొనసాగుతోంది.
ముఖ్యంగా యువతతో పాటు కన్జర్వేటివ్ క్రిస్టియన్ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ పనిచేస్తోంది.
ఒరిజినల్ రిపోర్టింగ్‌తో పాటు వివిధ అంశాలపై విశ్లేషణలను కూడా ప్రచురిస్తోంది.
ఇలా ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పక్కన కనిపించడంతో జేమీ లీ ఫ్రాంక్లిన్ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రంప్ పక్కన మహిళపై ఆసక్తికర చర్చ
Claims she has a button fitted on her belly, and when she gets the nod that he’s asleep she moves her hand and presses a button that wakes him. They’re calling her The Zapper. No idea if it’s true but it *appears* to line up. pic.twitter.com/hgx4x6iQp6
— Tim Brannigan (@tim_brannigan) August 11, 2026