France: ఫ్రాన్స్ సంగీత ఉత్సవంలో హింస.. దేశవ్యాప్తంగా 243 మంది అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే సంప్రదాయ సంగీత ఉత్సవం 'ఫేట్ డి లా ముసిక్' ఈసారి హింసాత్మక ఘటనలతో వార్తల్లో నిలిచింది. జూన్ 21న దేశవ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో ఘర్షణలు, దాడులు,ఇతర నేరాలకు పాల్పడిన 243 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణం ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ప్రజలు వీధుల్లోకి రావడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పారిస్ నగరంలోనే సుమారు 5,000 మంది పోలీసులను మోహరించగా, అక్కడ ఒక్కరోజులోనే 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వేడుకల్లో మహిళలు,బాలికలను లక్ష్యంగా చేసుకుని జరిగిన సిరంజి దాడులు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి.
వివరాలు
పది మందికి పైగా బాధితులకు బలవంతంగా ఇంజక్షన్ సూదులు గుచ్చినట్లు ఫిర్యాదులు
గుంపుల్లోని కొందరు ఆకతాయిలు పది మందికి పైగా బాధితులకు బలవంతంగా ఇంజక్షన్ సూదులు గుచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనల్లో బాధితులకు మత్తుమందులు లేదా డేట్-రేప్ డ్రగ్స్ వంటి పదార్థాలు అందించారా అనే అనుమానాలతో పోలీసులు టాక్సికాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వేడుకల సందర్భంగా రెండు కత్తిపోటు ఘటనలు, రెండు అత్యాచారాలు, పలు లైంగిక వేధింపులు, దొంగతనాలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
ఈ సంగీత ఉత్సవాలకు విశేష ఆదరణ
1982 నుంచి ఫ్రాన్స్‌లో ఉచితంగా నిర్వహిస్తున్న ఈ సంగీత ఉత్సవాలకు విశేష ఆదరణ ఉంది. అయితే గతంలో కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేరేపిత సూది దాడుల ఘటనలు నమోదయ్యాయి. ఈసారి కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ, పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగామని అధికారులు తెలిపారు. గత సంవత్సరాలతో పోలిస్తే అరెస్టుల సంఖ్య కూడా తక్కువగానే ఉందని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు. బాధితుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఘటనలపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫ్రాన్స్ సంగీత ఉత్సవంలో హింస.
🇫🇷 France's annual midsummer festival left two people stabbed, two women raped, multiple SAs reported, more than ten women attacked with syringes, and 243 arrests nationwide. Officials described this year's edition as having "no major incidents". pic.twitter.com/vhyaZIl6ez
— Floris Kraan (@thefloriskraan) June 22, 2026