LOADING...
CR450: గంటకు 453 కిలోమీటర్ల వేగంతో రికార్డు సృష్టించిన సీఆర్ 450.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఆవిష్కరించిన చైనా
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఆవిష్కరించిన చైనా

CR450: గంటకు 453 కిలోమీటర్ల వేగంతో రికార్డు సృష్టించిన సీఆర్ 450.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఆవిష్కరించిన చైనా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా రైల్వే రవాణా రంగంలో మరో సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ రైలు 'సీఆర్450'ని ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్‌లో ఈ రైలు గంటకు 453 కిలోమీటర్ల (281 మైళ్లు) వేగాన్ని చేరుకుని కొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం,ఈ రైలు షాంఘై-చోంగ్‌కింగ్-చెంగ్డూ రైల్వే మార్గంలో ప్రీ-సర్వీస్ టెస్టింగ్ దశలో ఉంది. ప్రయాణికుల కోసం సేవలకు అందుబాటులోకి వచ్చినప్పుడు,సీఆర్450 గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం చైనాలో నడుస్తున్న సీఆర్400 ఫక్సింగ్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కాబట్టి, సీఆర్450 దాని కంటే అత్యాధునిక మరియు శక్తివంతమైన రైలుగా ఉంటుంది.

వివరాలు 

ఆరు లక్షల కిలోమీటర్ల టెస్టింగ్ తర్వాత సేవలు ప్రారంభం 

పాత మోడల్‌తో పోలిస్తే దీని బరువు 50 టన్నుల వరకు తగ్గించబడింది, అలాగే గాలి నిరోధకతను 22% తగ్గించడానికి ఏరోడైనమిక్ డిజైన్ను మెరుగుపరిచారు. సీఆర్450 రైలు కేవలం 4 నిమిషాలు 40 సెకన్లలో సున్నా నుంచి గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇటీవల, రెండు సీఆర్450 రైళ్లు ఎదురుగా ప్రయాణిస్తూ గంటకు 896 కిలోమీటర్ల సంయుక్త వేగాన్ని నమోదు చేసి మరో అరుదైన ఘనతను సాధించాయి. ప్రయాణికుల సేవల్లోకి ప్రవేశం ముందు, ఈ రైలు దాదాపు 6 లక్షల కిలోమీటర్ల దూరం ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ప్రయాణించాలి. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత, సీఆర్450 రైలు మరింత నిశ్శబ్దమైన, పర్యావరణహితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గంటకు 453 కిలోమీటర్ల వేగం