Page Loader
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు

వ్రాసిన వారు Stalin
Apr 10, 2023
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి కారుకు నంబర్ ప్లేట్ ఉంటుంది. ఇది వాహనం గుర్తింపును సూచిస్తుంది. అయితే రూ.వేలు వెచ్చించి తీసుకునే లైసెన్స్ ప్లేట్‌ను ఓ కారు యజమాని రూ.లక్షలు కాదు, కొన్ని రూ. కోట్లు వెచ్చించి దక్కించుకున్నారు. యూఏఈలో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.122.6 కోట్లను చెల్లించి వీఐపీ పీ7 లైసెన్స్ ప్లేట్‌ను ఓ కారు యజమాని సొంతం చేసుకున్నారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా నిలిచింది. తద్వారా గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. వాస్తవానికి నోబెల్ నంబర్లను ఎక్కువ భాగం యూఏఈలో వేలం ద్వారా విక్రయిస్తారు. ఆ ప్రీమియం నంబర్లు కొన్ని రూ.కోట్లు పలుకుతుంటాయి. అయితే చరిత్రలో తొలిసారి ఇంత మొత్తంలో నంబర్ ప్లేట్‌గా అమ్ముడు పోవడం ఇదే తొలిసారి.

రంజాన్

పేదలకు ఆహారం పెట్టేందుకు ఈ సొమ్ము వినియోగం

జుమేరాలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన 'మోస్ట్ నోబుల్ నంబర్స్' ఛారిటీ వేలంలో 55 మిలియన్ దిర్హామ్‌ల(రూ.122.6 కోట్లు)కు పీ7 నంబర్‌ ప్లేట్‌గా విక్రయించబడింది. అలాగే వీఐపీ నంబర్ ప్లేట్లతోపాటు ఫోన్ నంబర్‌లు కూడా వేలం వేయబడ్డాయి. వేలం ద్వారా 100మిలియన్ దిర్హామ్‌లు (27 మిలియన్ డాలర్లు) వచ్చాయి. ఈ మొత్తాన్ని రంజాన్ సందర్భంగా పేదలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తారు. అయితే ఇంత మొత్తాన్ని వెచ్చించి నంబర్ ప్లేట్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరును నిర్వాహకులు వెల్లడించలేదు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును '1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్'కు నేరుగా మళ్లించనున్నారు.