
Ciel Dubai Marina: దుబాయ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన హోటల్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే!
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్‌లో ఇంకొక ఆకాశహర్మ్యం సందర్శకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్‌ను త్వరలో ఈ నగరం ప్రారంభించనుంది. 1,197 అడుగులు (365 మీటర్లు) ఎత్తు గల 'సీల్ దుబాయ్ మెరీనా' ఈ సంవత్సరాంతంలో ప్రారంభమయ్యే అవకాశముంది.
ప్రత్యేకత
సీల్ దుబాయ్ మెరీనా ప్రత్యేకతలు:
'ది ఫస్ట్ గ్రూప్' సంస్థ అభివృద్ధి చేసిన సీల్ దుబాయ్ మెరీనా హోటల్‌లో 82 అంతస్తులు ఉంటాయి. ఇందులో 147 సూట్‌లు సహా మొత్తం 1,004 గదులు ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ NORR గ్రూప్ డిజైన్ చేసిన ఈ హోటల్,ఆధునిక నిర్మాణ శైలితో పాటు లగ్జరీ ఆతిథ్యాన్ని కలిపి ప్రత్యేకమైన స్కైలైన్ అనుభూతిని వినియోగదారులకు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రత్యేకత
సీల్ దుబాయ్ మెరీనా ప్రత్యేకతలు:
సీఆర్ 18వ బ్యూరో గ్రూప్ ఆఫ్ దుబాయ్ (CR18BG) వెల్లడించిన వివరాల ప్రకారం,ఈ హోటల్‌లో 12 అంతస్తులుగా నిర్మించిన 'ఏట్రియం స్కై గార్డెన్', 1,158 అడుగుల ఎత్తులో ఏర్పాటయ్యే 'స్కై రెస్టారెంట్', అలాగే భూమి నుండి 1,004 అడుగుల ఎత్తులో ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'ఇన్ఫినిటీ పూల్' హోటల్ ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. అంతేకాదు, భూమి నుంచి పైకప్పు వరకు అమర్చిన గాజు కిటికీల ద్వారా అతిథులు పర్షియన్ గల్ఫ్ దృశ్యాలను 360 డిగ్రీల కోణంలో వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.