Page Loader
X వినియోగదారులపై బాంబ్ పేల్చిన ఎలాన్ మస్క్.. ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనట
ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనట

X వినియోగదారులపై బాంబ్ పేల్చిన ఎలాన్ మస్క్.. ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనట

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ట్విట్టర్ వాడాలంటే ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనని ఎలాన్ మస్క్ మరోసారి ప్రకటించేశారు. కొంతకాలంగా 'X'​లో మస్క్, భారీ మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ట్విట్టర్ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నేతన్యాహూ టెస్లా కార్లను పరిశీలించేందుకు ఆ ప్లాంట్ కు వెళ్లాకు. ఈ భేటీలో కీలక అంశాలపై మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడిన ఎలాన్ మస్క్, ట్విట్టర్​ను వాడుకోవాలంటే, ప్రతినెలా కొంత డబ్బును చెల్లించాలని సూచిస్తున్నారు. ఈ మేరకు మార్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు మస్క్​ చెప్పారు. ఎక్స్​లో ఉన్న బాట్స్​ సమస్యకు ఇదే పరిష్కారమని మస్క్ అన్నారు. నెలవారీ రుసుం చెల్లింపులతో బాట్స్ ను తగ్గించుకోవచ్చన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎలాన్ మస్క్ తో ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నేతన్యాహూ