Page Loader
US: విమానంలో ఘర్షణ.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. వీడియో వైరల్ 
విమానంలో ఘర్షణ.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. వీడియో వైరల్

US: విమానంలో ఘర్షణ.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. వీడియో వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆకాశంలో ప్రయాణం చేస్తుండగా ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. విమాన ప్రయాణ సమయంలోనే ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకు దిగారు. అంతటితో ఆగక, భారత మూలాలైన ఒక యువకుడు తన తోటి ప్రయాణికుడి గొంతు కోసే స్థాయికి వెళ్లిపోయాడు. సహచర ప్రయాణికులు వారిస్తున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ దృశ్యాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన జూన్ 30న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. న్యూయార్క్‌కు చెందిన 21 ఏళ్ల ఇషాన్ శర్మ అనే యువకుడు ఈ విమానంలో ప్రయాణిస్తున్నాడు. విమానం ఫిలడెల్ఫియా నుంచి మయామికి వెళ్తున్న సమయంలో, శర్మ తన ముందున ఉన్న సీటులో కూర్చున్న కీను ఎవాన్స్ అనే ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు.

వివరాలు 

దాడి వెనుక ఎటువంటి కవ్వింపులు లేవు 

ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన శర్మ, ఎవాన్స్ గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. వెంటనే అతని గొంతు కోసే ప్రయత్నం కూడా చేశాడు. ఈ దాడితో విమానంలోని ఇతర ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. వారు మధ్యలో ప్రవేశించి శర్మను ఆపేందుకు యత్నించినా, అతన్ని నియంత్రించడం సాధ్యపడలేదు. అయితే ఈ దాడి వెనుక ఎటువంటి కవ్వింపులు లేనట్లుగా తెలుస్తోంది. దాడికి గురైన ఎవాన్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, "తన సీటు వద్దకు వెళ్లే క్రమంలో శర్మ తన మెడను బలంగా పట్టుకున్నాడు" అని తెలిపారు. "అతడు తనను చంపుతానని బెదిరించాడు. దీనిపై తక్షణమే విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చి, అత్యవసర బటన్ నొక్కమని కోరాను" అని చెప్పాడు.

వివరాలు 

ఘర్షణలో శర్మకు స్వల్ప గాయాలు 

విమానము మయామి విమానాశ్రయానికి చేరిన వెంటనే పోలీసులు ఇషాన్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో శర్మకు స్వల్ప గాయాలయ్యాయి. అతడి కంటిపై గాయమయినట్లు గుర్తించారు. అనంతరం మంగళవారం శర్మను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా శర్మ న్యాయవాది స్పందిస్తూ, "ఇషాన్ శర్మ ధ్యానం చెయ్యడం దురదృష్టవశాత్తు శర్మ వెనుక సీటులో ఉన్న వ్యక్తికి నచ్చలేదు. ఇదంతా దురదృష్టకర ఘటన" అని వివరణ ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..