Page Loader
Zelensky: రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు: జెలెన్‌స్కీ
రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు: జెలెన్‌స్కీ

Zelensky: రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు: జెలెన్‌స్కీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2024
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా, రష్యాకు పెద్ద సంఖ్యలో సైనికులను పంపిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ, ఉత్తర కొరియా రష్యాకు 12,000 మంది సైనికులను తరలిస్తున్నాడని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడానికి ఇప్పటికే 3,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాలో ప్రవేశించారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, రష్యా దాదాపు 12,000 మంది ఉత్తర కొరియా సైనికుల సహాయంతో ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.

వివరాలు 

కుర్క్స్ ప్రాంతంలో  సైనిక బలగాలు

ఈ వారాంతంలో ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి రష్యా సిద్ధమవుతున్నట్లు సమాచారం లభించిందని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉత్తర కొరియా చేరితే, అది ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు ముప్పుగా మారుతుందని, మూడో ప్రపంచ యుద్ధం ప్రమాదంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఉత్తర కొరియా రష్యాలోని తమ బలగాలను తరలిస్తున్న విషయాన్ని నాటో కూడా ధ్రువీకరించింది. కుర్క్స్ ప్రాంతంలో కొన్ని సైనిక బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తెలిపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సరిగ్గా కాదని, ఇది పరిస్థితిని మరింత కిరాతకంగా చేయుతుందని ఆయన చెప్పారు.

వివరాలు 

ప్రపంచ దేశాలు ఈ పరిణామాలపై ఆందోళన

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ, ప్రపంచ దేశాలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొంటే, వారు కూడా లక్ష్యాలుగా మారవచ్చని అమెరికా సూచించింది. యుద్ధాలు పరిష్కరించేందుకు ఇది సరైన సమయం కాదని, వివాదాలను రణక్షేత్రంలో పరిష్కరించలేమని భారత ప్రధాని మోదీ తెలిపారు. ఉక్రెయిన్ వంటి ఘర్షణలను చర్చలు,దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని, అందుకు రష్యా, ఉక్రెయిన్ నేరుగా చర్చించాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.

వివరాలు 

 ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి జీ7 దేశాల ఆర్థిక సహాయం 

యుద్ధం వల్ల తీవ్ర నష్టాలు చవిచూసిన ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందించాలన్నది జీ7 దేశాల నాయకుల నిర్ణయం. ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లు అమెరికా ద్వారా అందించనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. మిగిలిన 30 బిలియన్ డాలర్లు ఐరోపా, యూకే, కెనడా, జపాన్ వంటి జీ7 దేశాల నుంచి అందించబడతాయని తెలిపారు.