Mark Zuckerberg: బైడన్ ప్రభుత్వంపై జుకర్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ దుష్ఫ్రభావాల గురించి మాట్లాడే పోస్టులను తీసేయాలని ప్రభుత్వ అధికారులు మెటాకు ఒత్తిడి చేశారని తెలిపారు. 'ద జో రోగన్ ఎక్స్‌పీరియన్స్' పాడ్‌కాస్ట్‌లో భాగంగా ఈ విషయాలపై ఆయన స్పందించారు.
బైడెన్ ప్రభుత్వం కొవిడ్ టీకాలను తీసుకొచ్చే సమయంలో వ్యాక్సిన్ గురించి వివిధ వాదనలు సెన్సార్ చేయడానికి ప్రయత్నించారని తనకు అనిపించిందన్నారు.
వ్యక్తిగతంగా తాను టీకాలకు అనుకూలమేనని చెప్పినా, వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి చర్చించే పోస్టులను తీసేయాలని వైట్‌హౌస్ సిబ్బంది నుంచి ఒత్తిడి వచ్చిందని జుకర్‌బర్గ్ చెప్పారు.
Details
సెన్సార్‌షిప్ విధానాలపై మార్పులు
కాబట్టి అప్పుడు వచ్చిన కంటెంట్ సెన్సార్ చేశామని, ఇది హాస్యాస్పదంగా మారిందని ఆయన పేర్కొన్నారు. జుకర్‌బర్గ్ టైటానిక్ నటుడు లియోనార్డో డికాప్రియోపై వచ్చిన మీమ్‌ను ఉదాహరణగా ఇచ్చారు.
అది కొవిడ్ వ్యాక్సిన్ దుష్ఫ్రభావాలు ఉండవచ్చని అప్పట్లో వైరల్ అయ్యింది.
ఇటీవల జుకర్‌బర్గ్ మెటా సంస్థలో నకిలీ, హానికర సమాచారం వ్యాప్తి నివారించేందుకు తీసుకుంటున్న సెన్సార్‌షిప్ విధానాలపై మార్పులు చేసినట్లు వెల్లడించారు.
సెన్సార్‌షిప్ అధిక స్థాయికి చేరుకుందని, తమ విధానాలను సరళీకరించి, స్వేచ్ఛను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని జుకర్‌బర్గ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు.
ఈ ప్రకటన అనంతరం, ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.