Page Loader
Hyundai i20 vs Tata Altroz : 2023 హ్యుందాయ్​ ఐ20 వర్సెస్​ టాటా ఆల్ట్రోజ్​.. మైలేజీలో ఏది బెస్ట్? 
2023 హ్యుందాయ్​ ఐ20 వర్సెస్​ టాటా ఆల్ట్రోజ్​.. మైలేజీలో ఏది బెస్ట్?

Hyundai i20 vs Tata Altroz : 2023 హ్యుందాయ్​ ఐ20 వర్సెస్​ టాటా ఆల్ట్రోజ్​.. మైలేజీలో ఏది బెస్ట్? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2023
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ ఐ 20 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్, టాటా ఆల్ట్రోజ్ పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ రెండింటి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండింట్లో ఏది బెస్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో 16 ఇంచ్​ డిజైనర్​ అలాయ్​ వీల్స్​, జెడ్​- షేప్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​తో కూడిన రివైజ్​డ్​ బంపర్స్​, భారీ హెక్సాగొనల్​ బ్లాక్​ గ్రిల్​, స్కల్ప్​టెడ్​ బానెట్​, ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​తో కూడిన కొత్త స్వెప్ట్​బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​ వంటి ఫీచర్స్ ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్​లో షార్క్​ ఫిన్​ యాంటీనా, స్వెప్ట్​ బ్యాక్​ ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, బంపర్​ మౌంటెడ్​ ఫాగ్​ ల్యాంప్స్​, మస్క్యులర్​ హుడ్​, స్లీక్​ బ్లాక్​ గ్రిల్​, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్‌తో అకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Details

ఇండియాలో టాటా ఆల్ట్రోజ్​ ధర రూ. 6.6లక్షలు నుంచి ప్రారంభం  

2023 హ్యుందాయ్​ ఐ20 హ్యాచ్​బ్యాక్​ 5 సీటర్​ కేబిన్​లో సెమీ లెథరెట్​ సీట్స్​, వయర్​లెస్​ ఛార్జర్​, వాయిస్​ కంట్రోల్డ్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, బాస్​ సౌండ్​ సిస్టెమ్​, 10.25 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్​ ఉన్నాయి. అదే విధంగా టాటా ఆల్ట్రోజ్​లో డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, వాయిస్​ కంట్రోల్డ్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, ఎయిర్​ ప్యూరిఫయర్​, వయర్​లెస్​ ఛార్జర్​, డీజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 7.0 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి లభిస్తున్నాయి. ఇండియాలో టాటా ఆల్ట్రోజ్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.6లక్షలు- రూ. 10.74లక్షల మధ్యలో ఉండగా, 2023 హ్యుందాయ్​ ఐ20 ఎక్స్​షోరూం ధర రూ. 6.99లక్షలు- రూ. 11.1లక్షల మధ్యలో ఉంది.