త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA
కొత్త తరం హ్యుందాయ్ VERNA ఈ మార్చిలో భారతదేశంలో ఉత్పత్తికి వెళ్లనుంది. ఏటా 70,000 యూనిట్లను తయారు చేయాలని హ్యుందాయ్ సంస్థ ఆలోచిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ఎగుమతి అవుతాయి. పెట్రోల్-ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. హ్యుందాయ్ VERNAకి సాధారణ ఫేస్‌లిఫ్ట్‌కు బదులుగా ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. ఈ కారు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా ఉండేలా రూపొందిస్తుంది. భారతదేశం మార్కెట్ లో సెడాన్ సెగ్మెంట్ లో స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటితో పోటీ పడుతుంది.
RDE నిబంధనల కారణంగా డీజిల్ ఇంజన్ మోడల్ అందుబాటులో లేదు
హ్యుందాయ్ VERNA 115hp, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో, కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్లుతో నడుస్తుంది. RDE నిబంధనల కారణంగా డీజిల్ ఇంజన్ మోడల్ అందుబాటులో లేదు. 2023 హ్యుందాయ్ VERNA ఆటో క్లైమేట్ కంట్రోల్, USB ఛార్జర్‌లు, కీలెస్ ఎంట్రీ, వెనుక AC వెంట్‌లతో పాటు మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్న విశాలమైన 5-సీటర్ క్యాబిన్ తో వస్తుంది. . ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్ ఉంటాయి. భారతదేశంలో 2023 VERNA ధర, ఇతర వివరాలు ఈ కార్ విడుదల సమయంలో హ్యుందాయ్ వెల్లడిస్తుంది. అయితే, దీని ధర ప్రస్తుత అవుట్‌గోయింగ్ మోడల్ కన్నా ఎక్కువ ఉంటుంది సుమారు రూ. 9.64 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉండచ్చు.